అటవీ అధికారుల చేతివాటం

16 Mar, 2015 02:53 IST|Sakshi

పట్టుపడిన ట్రాక్టర్‌ను వినియోగించుకుంటున్న వైనం
 
అట్లూరు: ఉన్నత అధికారుల పర్యవేక్షణ లోపించడంతో ఫారెస్టు అధికారులు చేతివాటం ప్రదర్శించి ప్రభుత్వ నిధులతో జేబులు నింపుకొంటున్నారు. లంకమల్లేశ్వర అభయారణ్యం కోడూరు బీట్‌లో గుర్రట్లబావి ప్రదేశంలో గతేడాది ఎర్రచందనం దుంగలతో సహా మేస్సే పర్‌గూషన్ 241 ట్రాక్టరును స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో ట్రాక్టరుపై ఓఆర్ నంబరు 19113-14 కింద కేసు నమోదు చేసి సిద్దవటం అటవీ శాఖ కార్యాలయంలో సీజ్ చేశారు. ఆ ట్రాక్టరుపై కేసు పూర్తి అయిన తరువాత ప్రభుత్వ అనుమతితో యాక్షన్ వేయాలి. అలాంటిది సిద్దవటం ఫారెస్టు అధికారులు సిద్దవటం, అట్లూరు మండలాల పరిధిలోని అటవీ ప్రాంతంలో జంతువులకు తాగునీరు అదే ట్రాక్టరుకు ట్యాంకరు జోడించి తరలిస్తున్నారు.

అదే ట్రాక్టరుకు ప్రైవేటు ట్యాంకరుతో నీటిని తరలించి డబ్బులు కాజేస్తున్నట్లు సమాచారం. కేసుల్లో పట్టుబడి సీజ్ చేసిన వాహనాలను వినియోగించ కూడదని చట్టం ఉన్నా అందుకు విరుద్ధంగా సిద్దవటం ఫారెస్టు అధికారులు వ్యవహరిస్తున్నారు. జేబులు నింపుకునేందుకు ఆ వాహనాలను వినియోగించడం సిద్దవటం ఫారెస్టు అధికారులకు మామూలయిందని విమర్శలున్నాయి.
 గతంలో కూడా పట్టపడ్డ బొలేరో వాహనాన్ని కూడా కలివికోడి పరిశోధకులకు అప్పగించారు. ఉన్నత అధికారులు సిద్దవటం అటవీ శాఖ అధికారుల అవినీతిపై విచారణ చేస్తే ఇంకా కొన్ని అక్రమాలు వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయని ప్రజలు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు