‘శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు’

3 Jun, 2020 14:28 IST|Sakshi

సాక్షి, అమరావతి : పోలీస్‌శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ముందుకెళ్తున్నామని, పోలీస్‌శాఖలో తొలిసారిగా వీక్లీఆఫ్ కల్పించామని తెలిపారు. స్పందన కార్యక్రమంలో వినతులను గడువులోగా పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. 95శాతం సమస్యలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించామన్నారు.(రాష్ట్రమంతా భూముల రీసర్వే)

స్పందన పోర్టల్ ద్వారా ప్రజలకు, పోలీసులకు మధ్య దూరం తగ్గిందని, 4లక్షల మంది దిశ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకున్నారని సవాంగ్ అన్నారు. కరోనా సమయంలో డయల్ 100, 112 ఎంతో ఉపయోగపడ్డాయని, టెక్నాలజీ వాడకంలో ముందంజలో ఉన్నామన్నారు. విజయవాడ పటమట గ్యాంగ్‌ వార్‌ ఘటన దురదృష్టకరమని, వీటికి కారణమైన వారిపై కఠిన చర్యలుంటాయన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.(కరోనా టెస్టుల్లో మరో రికార్డు సాధించిన ఏపీ)

మరిన్ని వార్తలు