గెయిల్ గ్యాస్‌ పైపులైన్‌ పేలుడు,13మంది సజీవదహనం

27 Jun, 2014 10:11 IST|Sakshi

తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరంలో జీసీఎస్ వద్ద శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎన్ఎఫ్సీల్, జీఎఫ్సీల్, తాటిపాకకు గ్యాస్‌ సరఫరా చేసే గ్యాస్‌ ట్రంక్ పైప్‌లైన్ పేలడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో సంభవించిన బ్లో అవుట్ స్థాయిలో కాకపోయినా.. ఈ ఘటనలో 18మంది సజీవ దహనమైనట్టు సమాచారం. 20 మందికి పైగా తీవ్ర గాయాలయినట్టు తెలుస్తోంది. క్షతగాత్రుల పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు. గ్యాస్ పంపులైన్ పేలడంతో  బ్లోఔట్ మాదిరిగా పెద్ద ఎత్తున శబ్దాలతో భారీగా మంటలు ఎగసిపడుతూ చుట్టుపక్కలకు విస్తరిస్తున్నాయి.

అయితే మంటల తీవ్రత అంతకంతకూ పెరుగుతుండటంతో పరిసార ప్రాంతాల్లో దట్టమైన పొగ ఆవరించింది. భారీగా ఆస్తినష్టం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాద స్థలికి సమీపాన నివసిస్తున్న స్థానికులు భయందోళనతో పరుగులు పెడుతున్నారు. సమాచారం అందుకున్న గెయిల్ సిబ్బంది 5 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు