వైరల్‌ ఫీవర్‌తో బాలిక మృతి

13 Sep, 2019 13:21 IST|Sakshi
చిన్నారి సిరిచందన మృతదేహం వద్ద నివాళులు అర్పిస్తున్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి బాలినేని

వైద్యశిబిరం ఏర్పాటు చేయాలని డీఎంహెచ్‌వోకు ఆదేశాలు

ఒంగోలు సెంట్రల్‌: ఒంగోలులో వైరల్‌ ఫీవర్‌తో ఓ బాలిక బుధవారం మృతి చెందింది. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి బాలిక కుటుంబ సభ్యులను గురువారం పరామర్శించారు. అందిన వివరాల ప్రకారం.. ఒంగోలు సంతపేట 14వ డివిజన్‌ పరిధి ఆంజనేయస్వామి గుడి పక్కన నివసించే రెబ్బ రమేష్‌ కుమార్తె సిరి చందన (6) కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. తల్లిదండ్రులు కుమార్తెను సుందరయ్య భవన్‌ రోడ్డులోని చిన్న పిల్లల వైద్యశాలలో చేర్పించారు. వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌గా గుర్తించిన అక్కడి వైద్యులు పాపకు చికిత్స అందించారు. ఇంతలో పరిస్థితి విషమించి బాలిక మృతి చెందింది. స్థానిక వైఎస్సార్‌ సీపీ నాయకులు విషయాన్ని మంత్రి బాలినేని దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన బాలిక తల్లిదండ్రులను పరామర్శించారు. మంత్రి మాట్లాడుతూ జ్వరాలు ప్రబలకుండా నగరంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ బి.వినోద్‌కుమార్‌ను ఆదేశించారు.

వైద్య శిబిరాలు
సంతపేటలో వైరల్‌ జ్వరాలు ప్రబలడంతో అక్కడ గురువారం ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. డీఎంహెచ్‌వో పర్యవేక్షణలో డిప్యూటీ డీఎంహెచ్‌వోలు డాక్టర్‌ మాధవీలత, డాక్టర్‌ లక్ష్మీపాపారావులు తమ సిబ్బందితో కలిసి ఇంటింటికీ తిరిగి, జ్వరబాధితులను గుర్తించి వారికి వైద్య చికిత్సలు అందించారు.

మరిన్ని వార్తలు