చంద్రబాబు ఆరోపణలపై ఈసీ వివరణ

10 Apr, 2019 14:43 IST|Sakshi
గోపాలకృష్ణ ద్వివేదికి చంద్రబాబు ఫిర్యాదు

సాక్షి, అమరావతి: తాము ఎవరి పక్షాన పనిచేయట్లేదని ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ముఖ్య అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనలు మాత్రమే అమలు చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల​ సంఘం పక్షపాత వైఖరితో పనిచేస్తుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేయడంతో పాటు ఫిర్యాదు కూడా చేశారు. ఎవరి తరపున పనిచేయాలని ఎలాంటి ఉత్తర్వులు కేంద్ర ఎన్నికల సంఘం తమకు ఇవ్వలేదని చంద్రబాబుతో ఈ సందర్భంగా ద్వివేది చెప్పారు. ఎన్నికల నిర్వహణలో తాము నిష్పాక్షికంగా పనిచేస్తున్నామని, తమ మీద ఎవరి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు.

ద్వివేది వివరణతో సంతృప్తి చెందని చంద్రబాబు ఎన్నికల సంఘంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఎన్నికల వ్యవస్థ స్వతంత్రంగా లేకపోతే ఎన్నికలు ఎందుకని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడు, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినట్లు పనిచేస్తోందని ఆరోపించారు. ఎన్నికల సంఘానికి కూడా ఎలాంటి అధికారం లేకుండా పోయింద, సమూలంగా ప్రక్షాళన చేయాలని అన్నారు. కేజ్రీవాల్‌, డీఎంకె, మమతా బెనర్జీ అందరూ ఎన్నికల సంఘం విశ్వసనీయతను సందేహిస్తున్నారని చెప్పారు. ఢిల్లీలో కూర్చున్న వాళ్లు చెప్పినట్లు చేస్తామంటే కుదరని వ్యాఖ్యానించారు.

>
మరిన్ని వార్తలు