సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలి

5 Mar, 2018 07:53 IST|Sakshi

పర్చూరు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానం రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని ఏపీసీపీఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ జిల్లా టెక్నికల్‌ కమిటీ మెంబర్‌ దామా నాగేశ్వరరావు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. 30 సంవత్సరాలకుపైగా ప్రభుత్వ సేవ చేసిన ఉద్యోగులు, రిటైర్మెంట్‌ తర్వాత వృద్ధాప్యంలో జీవించటానికి ఆధారమైన పెన్షన్‌ భద్రతను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తానని హామీ ఇచ్చారు.

వితంతు పింఛన్‌ ఇవ్వడంలేదు సార్‌..
పీసీపల్లి:
‘నా భర్త క్యాన్సర్‌తో బాధపడుతూ రెండు సంవత్సరాల క్రితం చనిపోయాడు. నాకు నలుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నాడు. కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నా. అయితే వితంతు పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరు చేయలేదు. రేషన్‌కార్డు కూడా లేదు’ అని మల్కాపురానికి చెందిన పొట్లూరి లక్ష్మి జగన్‌మోహన్‌రెడ్డికి సమస్యను వివరించింది.

మరిన్ని వార్తలు