మలేషియా జైలులో గుంటూరు జిల్లా వాసి

28 Jul, 2019 04:32 IST|Sakshi
భార్య, కుమార్తెతో గురూజీ

టూరిస్ట్‌ వీసాతో వెళ్లి ఉద్యోగం చేస్తుండడంతో అరెస్టు

తన కుమారుడిని రక్షించాలని తండ్రి వేడుకోలు

‘స్పందన’లో గుంటూరు రూరల్‌ ఎస్పీకి వినతిపత్రం

గుంటూరు: స్నేహితుని మాటలు నమ్మిన ఓ యువకుడు దేశం గాని దేశం వెళ్లి జైలు పాలయిన ఘటన  వెలుగు చూసింది. తన కొడుకును రక్షించాలంటూ శనివారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని రూరల్‌ ఎస్పీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్పందన కేంద్రంలో ఓ పేద కుటుంబానికి చెందిన తండ్రి వేడుకోవడంతో విషయం బహిర్గతమయ్యింది. గుంటూరు జిల్లా, పిడుగురాళ్ల పట్టణం జానపాడు రోడ్డులో నివాసం ఉంటున్న బత్తుల గురూజీ కథనం మేరకు.. గురూజీ ఆటో నడుపుకుంటూ భార్య పద్మ, కుమార్తె చంద్రకళ, కుమారుడు నరసింహారావుతో కలసి జీవిస్తున్నాడు. 10వ తరగతి చదివిన కొడుకు నరసింహారావు ఏడాదిగా ఖాళీగా ఉంటున్నాడు. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువకుడు సైదారావుతో నరసింహారావు స్నేహంగా ఉండేవాడు. అతను గతేడాది చివరిలో మలేషియా వెళ్లి రెండు నెలల పాటు కూలి పనులు చేసి డబ్బుతో తిరిగొచ్చాడు. నరసింహారావును కూడా మలేషియా తీసుకెళ్తానని గురూజీ దంపతులను సైదారావు ఒప్పించాడు. రూ.లక్ష అప్పు చేసి..
కొడుకు జీవితం బాగు పడటంతో పాటుగా కుటుంబానికి ఆసరాగా ఉంటాడని బావించిన తండ్రి లక్ష రూపాయలు అప్పుచేసి ఐదు నెలల క్రితం నరసింహారావును మలేషియా పంపాడు. అక్కడకు వెళ్లిన అనంతరం ఓ కంపెనీలో ప్యాంకింగ్‌ విభాగంలో పని దొరికిందని నరసింహారావు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఆనంద పడ్డారు. అయితే అనంతరం అతని వద్ద నుంచి ఎలాంటి సమాచారం లేకుండా పోయింది. నాలుగు రోజుల క్రితం ఇంటికి వచ్చిన సైదారావును తమ కొడుకు సమాచారం కోసం విచారిస్తే నరసింహారావు జైలులో ఉన్నాడని, త్వరలోనే వస్తాడని చెప్పాడు.

గురూజీ సెల్‌ ఫోన్‌కు కుమారుడి దగ్గర నుంచి వచ్చిన లేఖ 

టూరిస్టు వీసా కావడంతో..
సైదారావు గతంలో టూరిస్ట్‌ వీసాతో మలేషియా వెళ్లొచ్చాడు. అదే తరహాలో నరసింహారావు వెళ్లాడు. పర్యాటకులుగా వెళ్లిన వ్యక్తులు అక్కడ ఎలాంటి ఉద్యోగం చేయకూడదనే నిబంధన ఉంది. దీంతో  నరసింహారావు కంపెనీలో పనిచేస్తున్నట్లు గుర్తించిన నిఘా విభాగం వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపారు. దీంతో కొంతమంది సహాయంతో తనను తీసుకెళ్లాలంటూ వాట్సాప్‌లో మూడు లేఖలను తండ్రికి  పంపించాడు. అధికారులు స్పందించి తమ కుమారుడిని కాపాడాలని గురూజీ దంపతులు వేడుకుంటున్నారు. ఎవరైనా సహాయం చేయాలనుకుంటే 8179827921 నంబర్లో సంప్రదించి ఆదుకోవాలని కోరుతున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

యువకుణ్ణి భుజంపై మోసిన 'ఆ' ఎస్సైకు రివార్డు!

‘వడ్డీ బకాయిపడితే దివాలా తీసినట్లు కాదు’

సీఎం జగన్‌కు జపాన్‌ ఆహ్వానం

ఈనాటి ముఖ్యాంశాలు

‘సీఎం వైఎస్‌ జగన్‌పై దుష్ప్రచారం’

32 లక్షల మంది వంచనకు గురయ్యారు

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన..

‘ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లు ఫ్రీగా ఇవ్వాలి’

సంగం డైరీలో దొంగలు పడ్డారు

జలగలు రక్తం పీల్చినట్టు.. ఫీజుల్ని దండుకుంటున్నారు

పులుల సంఖ్య పెరగడం సంతోషం : సీఎం జగన్‌

సంచలన కేసులను చేధించిన సిబ్బందికి అవార్డులు!

‘వంద కోట్లకు పైగా తగలేశారు’

చట్టవ్యతిరేక పనులను సహించం

ప్రజావేదికను టీడీపీ మరిచిపోతే మంచిది : మంత్రి అవంతి

ఈ బడ్జెట్‌తో మళ్లీ రాజన్న రాజ్యం: రోజా

ఏపీలో ఏడుగురు ఐపీఎస్‌ అధికారుల బదిలీ

రైల్వే ప్రైవేటీకరణపై కార్మిక సంఘాల ఆగ్రహం

సీఎం జగన్‌తో పార్టీ కాపు నేతలు భేటీ

ఉద్యోగాల విప్లవం తెచ్చాం : ఎమ్మెల్యే మేకపాటి 

అంతా మా ఇష్టం

ఆదివారం అంతే మరి!

కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా జక్కంపూడి రాజా

పురిటి పేగుపై కాసుల కత్తి

జగన్‌ మొదటి బడ్జెట్‌.. మనసున్న బడ్జెట్‌

మేఘమా.. కరుణించుమా!  

వైద్యరంగంలో ఇదో అద్భుతం

కొలువుల జాతర: ప్రత్యేక హెల్ప్‌ డెస్క్‌

ఏజెన్సీలో బూట్ల చప్పుళ్లు!

వాట్సాప్‌ ఆప్తుల సాహితీ దీప్తి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఏడు దేశాల్లో సినిమా షూటింగ్‌

సాహో నుంచి ‘ఏ చోట నువ్వున్నా..’

పెన్సిల్‌, ప్రియ గుడ్‌బై చెప్పేశారు

అదిరిపోయిన అధీరా లుక్‌..!

సూపర్‌స్టార్‌.. రియల్‌ బిజినెస్‌మేన్‌

‘బిగ్‌ బాస్‌ షోలో ఆయన చేసింది బాగోలేదు!’