వ్యవసాయ పోస్టులకు హాల్‌ టికెట్లు విడుదల

30 Mar, 2017 02:16 IST|Sakshi
వ్యవసాయ పోస్టులకు హాల్‌ టికెట్లు విడుదల

ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్‌టీ సాయి

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఏప్రిల్‌ 4, 5 తేదీల్లో నిర్వహించనున్న వివిధ పోస్టులకు సంబంధించి పరీక్ష హాల్‌ టికెట్లను విడుదల చేసింది. ఈ హాల్‌ టికెట్లను కమిషన్‌ వెబ్‌సైట్‌లో పొందిపరచినట్లు ఏపీ పీఎస్సీ కార్యదర్శి వైవీఎస్‌టీ సాయి తెలిపారు. కాగా అగ్రికల్చర్‌ డైరక్టరేట్‌లో వ్యవసాయ అధికారుల పోస్టులు, అసిస్టెంట్‌ కెమిస్ట్, టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌లో అసిస్టెంట్‌ డైరక్టర్లు, టౌన్‌ప్లానింగ్‌ అసిస్టెంట్లు, రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు గాను  ఏపీపీఎస్సీ ఇంతకు ముందు నోటిఫికేషన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.

తుది ‘కీ’ ఆధారంగా రెస్పాన్స్‌ షీట్లు...: ఏపీపీఎస్సీ ఇంతకు ముందు జారీ చేసిన వివిధ విభాగాల్లోని అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టుల పరీక్షల ‘కీ’ని విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరించింది. అనంతరం ఫైనల్‌ కీని ఖరారు చేసింది. దీని ఆధారంగా ఆయా అభ్యర్థుల వారీగా రెస్పాన్స్‌ షీట్లను రూపొందించింది. వీటిని అభ్యర్థులు పరిశీలించుకోవచ్చని ఏపీపీఎస్సీ పేర్కొంది.

మరిన్ని వార్తలు