మరిసారన్నా..

22 Jan, 2014 04:18 IST|Sakshi

ఇండోర్ స్టేడియం... దయనీయం
 క్రీడల అభివృద్ధి కోసం ప్రతిపాదించిన ఇండోర్ స్టేడియం పరిస్థితి దయనీయంగా మారింది. నాలుగేళ్ల క్రితమే నిర్మాణం పూర్తయినా క్రీడాకారులకు ఉపయోగపడడడం లేదు. రూ.3.50 కోట్లతో నిర్మించిన స్టేడియాన్ని కార్పొరేషన్ డంప్ యార్డుగా మార్చారు. ఇటీవలే చెత్త పోయడం నిలిపివేశారు. హన్మకొండ, కాజీపేట వాసులకు ఓపెన్ ఎయిర్ స్టేడియంలు, ఇండోర్ స్టేడియంలు, స్విమ్మింగ్‌ఫూల్ అందుబాటులో ఉన్నాయి. వరంగల్ క్రీడాకారులకు ఆ సౌకర్యం  లేకుండా పోయింది.
 
 పార్‌‌క నో...
 జిల్లా కేంద్రంలో మహిళల ఆర్థిక స్వావలంబనకు టైక్స్‌టైల్స్ పార్కు ఏర్పాటు విషయంలో మంత్రి సారయ్య చేస్తున్న చర్యలు ఏమీ లేవు. పార్కు కు కేటాయించిన స్థలం కబాకు గురైంది. మంత్రి  నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితి వచ్చిందనే విమర్శలున్నాయి.

 మో‘డల్’ మార్కెట్
 వరంగల్ కూరగాయల మార్కెట్ ప్రాంతం అపరిశుభ్రతకు నిలయంగా మారింది. మార్కెట్‌లో కనీస వసతులు లేవు. రూ.3 కోట్లతో మోడల్ మార్కెట్‌గా అభివృద్ధి చేస్తామన్న హామీ కార్యరూపం దాల్చలేదు.
 
 ‘నీటి’మూటలే...
 వరంగల్ ప్రజలకు ప్రతిరోజూ తాగునీరు అందిస్తామని మంత్రి సారయ్య చెప్పిన మాటలు నీటి మూటలుగా మిగిలిపోతున్నాయి. నగర ప్రజల దాహార్తిని తీర్చాలనే ఉద్దేశంతో అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి జైపాల్‌రెడ్డి రూ.178 కోట్ల నిధులను మంజూరు చేశారు. ఆ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. సదరు కాంట్రాక్టరుకు బిల్లుల చెల్లింపులు జరిగినట్లు తెలిసింది. నాసిరకం పైపులైన్లు, అధికార పార్టీ నేతల, అధికారుల కమీషన్ల కక్కుర్తితో పనులు నాసిరకంగా సాగాయి. నాణ్యతలేని పైపులైన్లతో నగర ప్రజలకు తాగు నీటి కష్టాలు తొలగడంలేదు.
 
 కలగానే... మ్యూజియం
 ఖిలావరంగల్ కోటలో మ్యూజియం నిర్మాణం కోసం ఇప్పటికి మూడుసార్లు శంకుస్థాపన జరిగింది. పనులు మాత్రం ప్రారంభానికి నోచుకోలేదు. గుండు చెరువు సమీప స్థలంలో 2010 మే 26న అప్పటి పర్యాటక శాఖమంత్రి  గీతారెడ్డిచే శంకుస్థాపన చేయించారు.  స్థల వివాదంతో అది అటకెక్కింది. కోటలోని మరో స్థలంలో 2012 మార్చి 19న శంకుస్థాపన జరిగింది. ఇప్పటికీ ఇది మందుకుపడడంలేదు. అంతరిక్ష విజ్ఞానం అందించే ప్లానిటోరి యం మూతపడింది. కార్పొరేషన్ ప్రాంగణంలో ఉన్న ప్రతాపరుద్ర ప్లానిటోరియం మూడేళ్లుగా తాళం వేసి ఉంది. ప్రొజెక్టర్ కొనలేక పోవడంతో ఈ దుస్థితి దాపురించింది.

మరిన్ని వార్తలు