పల్నాడు జిల్లా: ఒకే కుటుంబంలో ముగ్గురి దారుణ హత్య

23 Nov, 2023 08:11 IST|Sakshi

సాక్షి, పల్నాడు జిల్లా: పిడుగురాళ్ల మండలం కోనంగి గ్రామంలో అర్ధరాత్రి ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని సమీప బంధువులు విచక్షణారహితంగా కత్తులతో నరికి చంపారు. మృతులను తండ్రి సాంబశివరావు, భార్య ఆదిలక్ష్మి, కుమారుడు నరేష్‌గా పోలీసులు గుర్తించారు.

కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. కొన్నాళ్లుగా భార్యను భర్త, అత్త, మామ వేధిస్తున్నట్లు సమాచారం. హత్య అనంతరం భార్య మాధురితో సహా బంధువులు పోలీసుల ముందు లొంగిపోయినట్లు తెలిసింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు