కృష్ణా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు

7 Jun, 2016 20:10 IST|Sakshi

మచిలీపట్నం : ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో కృష్ణా జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఓ మోస్తరు భారీ వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచి వర్షాలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం వరకు ఆకాశం మేఘావృతమై ఉంది. సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తన ద్రోణి వ్యాపించి ఉందని వాతావరణశాఖ పేర్కొంది. జిల్లాలో 8.2 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఎ.కొండూరులో అత్యధికంగా 70.2 మిల్లీమీటర్లు, నందివాడలో అత్యల్పంగా 0.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

మరిన్ని వార్తలు