పోటాపోటీగా వరద ప్రవాహం

2 Aug, 2019 10:07 IST|Sakshi
ఆల్మట్టి జలాశయం అన్ని గేట్ల నుంచి పరుగులు తీస్తున్న కృష్ణా నది

శ్రీశైలంలోకి కృష్ణమ్మ పరవళ్లు

జలాశయంలో 43.14 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ

కడలి వైపు పరుగులు పెడుతున్న గోదారి

ధవళేశ్వరం నుంచి ఒకే రోజు 70 టీఎంసీలు సముద్రంలోకి..

పోలవరం వద్ద పరిస్థితిని సమీక్షిస్తున్న అధికారులు  

సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్‌/రాయచూరు రూరల్‌ : కృష్ణా, గోదావరి నదులు వరద ఉధృతితో పోటాపోటీగా ప్రవహిస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,93,400 క్యూసెక్కుల ప్రవాహంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంటే.. 7,39,745 క్యూసెక్కుల ప్రవాహంతో కడలి వైపు గోదావరి పరుగులు పెడుతోంది. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు కురుస్తుండటం, ఎగువ నుంచి భారీ వరద వస్తోందన్న కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) హెచ్చరికల నేపథ్యంలో కర్ణాటక సర్కార్‌ ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాల్లో నీటి మట్టాన్ని తగ్గించుకుంటూ.. భారీ ఎత్తున వరద జలాలను దిగువకు విడుదల చేస్తోంది. ఆ వరద జూరాల మీదుగా శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతోంది. శ్రీశైలం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా, గురువారం రాత్రి 7 గంటలకు నీటి మట్టం 823 అడుగులకు, నీటి నిల్వ 43.14 టీఎంసీలకు చేరుకుంది. జలాశయం నిండాలంటే ఇంకా 169 టీఎంసీలు అవసరం. మరోవైపు బీమా నదిలో వరద ప్రవాహం మరింతగా పెరిగింది. ఉజ్జయిని జలాశయంలోకి 79,861 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 74.64 టీఎంసీలకు చేరుకుంది. ఆ ప్రాజెక్టు నిండాలంటే 42 టీఎంసీలు అవసరం. వరద ప్రవాహం ఇదే రీతిలో కొనసాగితే వారం రోజుల్లో ఉజ్జయిని నిండే అవకాశం ఉంటుంది. తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వ 34.24 టీఎంసీలకు చేరుకుంది. అది నిండాలంటే ఇంకా 72.46 టీఎంసీలు అవసరం. ఆ రెండు జలాశయాలు నిండితే శ్రీశైలానికి వరద మరింతగా పెరుగుతుంది.  


822.30 అడుగులకు శ్రీశైలం డ్యామ్‌ నీటి మట్టం

ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు ఎత్తివేత 
గోదావరి నదిలో వరద ఉధృతి బుధవారంతో పోల్చితే గురువారం మరింతగా పెరిగింది. ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం రావడంతో డెల్టా కాలువలకు విడుదల చేయగా మిగులుగా ఉన్న 7,39,745 క్యూసెక్కులను ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలారు. బుధవారం ఉదయం ఆరు గంటల నుంచి గురువారం ఉదయం ఆరు గంటల వరకు 70 టీఎంసీల జలాలు సముద్రంలో కలిశాయంటే గోదావరి వరద ఉధృతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గురువారం రాత్రి నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు పడకపోతే.. శుక్రవారం గోదావరి వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

పోలవరం వద్ద అప్రమత్తం 
భద్రాచలం వద్ద వరద నీటి మట్టం 35.50 అడుగులకు చేరుకుంది. పోలవరం ప్రాజెక్టు కాఫర్‌ డ్యామ్‌ వద్ద నీటి మట్టం 27.54 అడుగులకు చేరుకుంది. కాఫర్‌ డ్యామ్‌ గ్యాప్‌ల గుండా.. పోలవరం స్పిల్‌ వే రివర్‌ స్లూయిజ్‌ల ద్వారా గోదావరి ప్రవాహం దిగువకు వెళ్తోంది. గోదావరిలో వరద ప్రవాహం 12 లక్షల క్యూసెక్కులకు చేరితే.. పోలవరం కాంటూర్‌ 41.15 మీటర్ల పరిధిలోని ముంపు గ్రామాలకు వరద జలాలు చేరుతాయని అధికార వర్గాలు తెలిపాయి. పోలవరం వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ముంపు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సముద్రంలో స్నానం చేస్తూ...

నేరాలపై ఉక్కుపాదం

దుష్ప్రచారాన్ని ఖండించిన ఏపీ ఆర్థిక శాఖ

మహిళా ఉద్యోగిపై...

అమ్మా ! నాకెందుకు ఈ శిక్ష.. 

వైఎస్సార్‌సీపీ నేతపై హత్యాయత్నం

లక్ష్మీదేవిని చూపితే ‘పాప’మే

ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

పల్లెతల్లి సేవకు తొలి అడుగు

భారీ వరద వేళ ప్రజాప్రతినిధుల సాహసం

లేడీస్‌ హాస్టల్‌కి వెళ్లి ఆ తర్వాత...

లేదే కనికరం.. రాదే పరిహారం!

సైనికుల్లా పనిచేస్తాం.. కార్యకర్తలకు అండగా ఉంటాం 

గుండెపోటుతో వీఆర్వో మృతి

సాక్షి ఫొటోగ్రాఫర్‌కు జాతీయ అవార్డులు

‘సాహిత్య సంపద డిజిటలైజేషన్‌’ వేగవంతం

నైజీరియా పక్షుల సందడి లేదు..

టాస్క్‌ఫోర్స్‌ టైగర్‌కు వీడ్కోలు

పాత ప్రీమియంతోనే వైఎస్సార్‌ బీమా

ఇక వర్షాలే వర్షాలు

సీపీఎస్‌ రద్దుకు సర్కారు కసరత్తు

శ్రీకాకుళం నుంచి శ్రీకారం

అన్నదాత పై అ‘బీమా’నం

పోలవరం అక్రమాలపై ‘రివర్స్‌’ పంచ్‌

మా వైఖరి సరైనదే

వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు

ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

ఏపీ అసెంబ్లీ చీఫ్‌ విప్‌, విప్‌లకు క్యాబినేట్‌ హోదా

బిగ్‌షాక్‌; బీజేపీలోకి టీడీపీ, జనసేన నేతలు

26న ఎమ్మెల్సీ ఎన్నికలు‌..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కాజల్‌ వద్దనుకుందా?

2019 అబ్బాయి.. 1993 అమ్మాయి!

సైబర్‌ క్రైమ్‌ గురించి చెప్పాం

లాక్‌ చేశారు

నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత

డైనమిక్‌ కమ్‌బ్యాక్‌