మత్స్యకారుల కోసం హెలికాప్టర్లతో అన్వేషణ

20 Jun, 2015 16:15 IST|Sakshi

కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా కాకినాడ తీరంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారులను రక్షిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు అన్నారు. శనివారం కాకినాడ బీచ్ రోడ్డులో బాధిత మత్స్యకార కుటుంబాలను మంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గల్లంతైన వారి కోసం రిలయన్స్ హెలికాప్టర్లతో ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నామని, సముద్రంలో వారు ఎక్కడ చిక్కుకున్నా గుర్తించి కాపాడతామన్నారు.

కాకినాడ దుమ్ములపేటకు చెందిన బోటులో ఆరుగురు మత్స్యకారులు ఈ నెల 17న సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన విషయం తెలిసిందే. కాగా దుమ్ములపేట, పర్లోపేటకు చెందిన మరో 20 బోట్ల సమాచారం కూడా తెలియరావడం లేదని మత్స్యకారులు పేర్కొంటున్న నేపథ్యంలో... కోస్ట్‌గార్డ్, రిలయన్స్ హెలికాప్టర్ల ఆధ్వర్యంలో వారి కోసం శనివారం కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

మరిన్ని వార్తలు