‘హలో గురూ.. మీ ప్రేమ కోసమే...

27 Oct, 2018 13:22 IST|Sakshi
సక్సెస్‌ మీట్‌లో హీరో రామ్, హీరోయిన్లు అనుపమ పరమేశ్వరన్, ప్రణీత, దర్శకుడు నక్కిన, నిర్మాత హర్షిత్‌రెడ్డి తదితరులు

‘హలో గురూ ప్రేమ కోసమే’ చిత్రం  యూనిట్‌ జిల్లాలో శుక్రవారం సందడి చేసింది.  ఈ సినిమా హీరో రామ్, హీరోయిన్లు అనుపమా పరమేశ్వరన్, ప్రణితలు ఈ సందర్భంగా మాట్లాడుతూ గోదావరి జిల్లాల వెటకారం చాలా బాగుంటుందని, అదంటే తమకు ఎంతో ఇష్టమంటూ కాకినాడ, రాజమహేంద్రవరంలో జరిగిన మీట్‌లలో ప్రకటించారు. ఈ సినిమా విజయానికి మీ ప్రేమ కావాలని, మీరంతా సినిమాను ఆదరిస్తారన్న ఆశతో మీ ముందుకు వచ్చానని రామ్‌ అన్నారు.  సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులను నేరుగా కలుసుకుని కృతజ్ఞతలు చెప్పేందుకు ఈ యాత్ర చేపట్టామన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులూ చూడదగ్గ చిత్రమన్నారు.

తూర్పుగోదావరి, ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌): గోదావరి జిల్లాల వెటకారం చాలా బాగుంటుందని, అదంటే తనకు చాలా ఇష్టమని సినీ హీరో రామ్‌ అన్నారు. శుక్రవారం హోటల్‌ షెల్టాన్‌లో ‘హలో గురూ ప్రేమ కోసమే’ చిత్రం సక్సెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ   సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేషస్పందన లభిస్తుందన్నారు. గురువారం రాత్రి అశోకా థియేటర్‌లో ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన మరిచిపోలేనిదన్నారు. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులను నేరుగా కలుసుకుని కృతజ్ఞతలు చెప్పేందుకు ఈ యాత్ర చేపట్టామన్నారు. ‘హలో గురూ ప్రేమ కోసమే’ అన్ని వర్గాల ప్రేక్షకులూ చూడదగ్గ చిత్రమన్నారు. కొత్త సినిమా ఏమి చేయాలన్నది త్వరలోనే ప్రకటిస్తానన్నారు.

హీరోయిన్‌ అనుపమా పరమేశ్వరన్‌ మాట్లాడుతూ దిల్‌రాజు ప్రొడక్షన్స్‌లో తాను రెండో చిత్రంలో నటించానన్నారు. ‘శతమానం భవతి’ సూపర్‌హిట్‌ అయిందని, ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు సక్సెస్‌ చేయడం సంతోషంగా ఉందన్నారు. రాజమహేంద్రవరం తనకు ఎంతో ఇష్టమని, ‘శతమానం భవతి’ షూటింగ్‌కు ఇక్కడ 40 రోజులు ఉన్నానని, ఇక్కడ వంటకాలు అంటే చాలా ఇష్టమని పేర్కొన్నారు. మరో హీరోయిన్‌ ప్రణీత మాట్లాడుతూ ఈ సినిమా విజయవంతం కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. సినిమాలోని ‘పెద్దకళ్ళ పాప’ పాట లిరిక్స్‌ చాలా బాగున్నాయన్నారు.

హ్యాట్రిక్‌ అందుకున్నా..
దర్శకుడు త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ తాను రూపొందించిన ‘సినిమా చూపిస్త మామా, నేను లోకల్‌’ హిట్‌ అయ్యాయని, ఈచిత్రాన్ని కూడా హిట్‌ చేసి ప్రేక్షకులు హ్యాట్రిక్‌ అందించారన్నారు. ఈ చి త్రాన్ని జిల్లాలో జి.మామిడాడ ప్రాం తంలో షూట్‌ చేశామన్నారు. జిల్లా ప్రశాంతంగా ఉంటుందని, ప్ర జలు నవ్వుతూ ఉంటారని కితా బిచ్చారు. నిర్మాత హæర్షిత్‌రెడ్డి మాట్లాడుతూ చిత్రాన్ని అన్ని ఏరియాల్లో ప్రేక్షకులు ఆదరిస్తున్నారన్నారు. రచయిత ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ సినిమాలో ఉప్మా డైలాగు ప్రేక్షకుల మదిలో కలకాలం నిలిచిపోతుందన్నారు. మరో రచయిత సాయికృష్ణ మాట్లాడుతూ సినిమాలో హీరో తండ్రి గోదా వరి యాసలో మాట్లాడడం ప్రేక్షకులను అలరించిందన్నారు. పంపిణీదారు వింటేజ్‌ క్రియేషన్స్‌ జేకే రా మకృష్ణ,  ప్రసాద్‌  పాల్గొన్నారు. కాగా చిత్రం యూ నిట్‌ కాకినాడ పద్మప్రియ థియేటర్లో ప్రేక్షకుల్ని కలుసుకుంది.

మరిన్ని వార్తలు