శివయ్యా.. బంగారుబల్లిని చూపవయ్యా

10 Dec, 2013 02:15 IST|Sakshi

శ్రీకాళహస్తీశ్వరాలయంలో బల్లి శిల్పం ఉన్నట్టు పదేళ్ల కిందట గుర్తించారు. వెండి తొడుగు అమర్చి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆ తర్వాత భక్తులు సమర్పించిన బంగారు తొడుగును అమర్చారు. అయితే గత ఏడాది విజయదశమి సందర్భంగా స్వామి దర్శన క్యూలను మార్పు చేశారు. దీంతో బంగారు బల్లి దర్శనానికి భక్తులు దూరమయ్యారు. అసంతృప్తితో వెనుదిరుగుతున్నారు.
 
 శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: బంగారు బల్లిని తాకితే బల్లిపడటం వల్ల కలిగే అనర్థాలు తొలగిపోతాయనేది భక్తుల విశ్వాసం. అందుకే కంచి ఆలయాన్ని దర్శించే భక్తులు ఖచ్చితంగా అక్కడి బంగారు బల్లిని స్పర్శించి తరిస్తారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ధ్వజస్తంభానికి పక్కనే పైకప్పుకు అమర్చిన రాళ్లపై బల్లి శిల్పం ఉన్నట్టు పదేళ్ల్ల కిందట గుర్తించారు. దీనికి తొలుత వెండి తొడుగును, ఆ తర్వాత బంగారు తొడుగును అమర్చారు. ఇక్కడే ఆ భాగ్యం కలగడంతో కంచికి వెళ్లలేని భక్తులు ఎంతో సంతోషించారు. అయితే ఆలయ అధికారుల అనాలోచిత నిర్ణయం కారణంగా ప్రస్తుతం భక్తులకు బల్లిని తాకే భాగ్యం కరువవుతోంది.
 
శ్రీకాళహస్తీశ్వరాలయంలో స్వామి, అమ్మవార్ల దర్శనమే కాకుండా అనేక దర్శనీయ ప్రదేశాలున్నాయి. వాటిలో బంగారుబల్లి ఒకటి. స్వామి సన్నిధికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం వద్ద ఆలయ పైకప్పులో రాతి బండపై బల్లి రూపాన్ని చెక్కారు. పదేళ్ల్ల క్రితం ఆలయాధికారులు గుర్తించి వెండి తొడుగును అమర్చారు. భక్తులకు వీలుగా ఉండేందుకు ప్రత్యేక నిచ్చెన ఏర్పాటు చేశారు. 2010 ఫిబ్రవరిలో జరిగిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన భక్తులు బంగారు తొడుగును విరాళంగా అందజేశారు.

దీంతో వెండి తొడుగు స్థానంలో బంగారు తొడుగు అమర్చారు. శరీరంపై బల్లి పడిన వారే కాకుండా, దోష నివారణ కోసం ఆలయానికి వచ్చే భక్తులు బంగారు బల్లిని తాకేందుకు ఆసక్తి చూపుతున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన విజయదశమి పండుగ సందర్భంగా స్వామివారి దర్శనానికి ఉన్న క్యూలను మార్పు చేశారు. బంగారుపల్లి వద్దకు వెళ్లకుండా గేట్లు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి బంగారుబల్లి దర్శనం భక్తులకు కరువైంది. దీంతో స్థానికులతో పాటు దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు బంగారుబల్లిని దర్శించే వీలులేక అసంతృప్తిగా వెనుదిరుగుతున్నారు.
 
 బంగారుబల్లిని తాకే అవకాశం కల్పించాలి
 శివయ్య సన్నిధిలో ఉన్న బం గారుబల్లిని దర్శించి, తాకేం దుకు హైదరాబాద్ నుంచి వచ్చాం. బంగారు బల్లిని తాకితే దోషాలు నివారణ అవుతాయన్నది గట్టి విశ్వా సం. అయితే ఆధికారులు బల్లిని తాకే అవకాశం కల్పించలేదు. దీంతో అసంతృప్తిగా వెళుతున్నాం.    
 - సంధ్య, హైదరాబాద్
 
 పరిశీలించి భక్తులకు అవకాశం కల్పిస్తాం
 ఆలయంలో బంగారుబల్లిని దర్శించుకునే అవకాశం ఎప్ప టి నుంచో ఉంది. ఏడాది క్రితం క్యూను సవరించిన దృష్ట్యా కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. ప్రత్యేకంగా ఏ ర్పాటు చేసిన నిచ్చెనను తొల గించారు. పరిశీలించి మళ్లీ బంగారుబల్లిని తాకే సదుపాయం కల్పిస్తాం.   
 - శ్రీరామచంద్రమూర్తి,  ఈవో
 

మరిన్ని వార్తలు