చంద్రబాబు సహా 57మందికి హైకోర్టు నోటీసులు

19 Sep, 2017 13:51 IST|Sakshi
చంద్రబాబు సహా 57మందికి హైకోర్టు నోటీసులు

సాక్షి, హైదరాబాద్‌ : కృష్ణానది పరివాహక కరకట్ట ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం... ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా 57మందికి నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి మూడు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.

కాగా సీఎం చంద్రబాబు ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటిని  నదీ పరిరక్షణ చట్టానికి విరుద్ధంగా నిర్మించిన లింగమనేని గ్రూపు నుంచి లీజుకు తీసుకున్నారు. ఇందులో లింగమనేని రమేష్, నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజులకు చెందిన భవనాలు, మంతెన సత్యనారాయణరాజుకు చెందిన ప్రకృతి ఆశ్రమం కట్టడాలున్న విషయం విదితమే. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.