ఏపీ డీజీపీకి హైకోర్టు నోటీసులు

22 Jun, 2018 11:23 IST|Sakshi

సాక్షి, విజ‌య‌వాడ: ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ మాల‌కొండ‌య్య‌కు హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. ఏ అధికారంతో నిందితులను మీడియా ముందు ప్రవేశపెడ్డుతున్నారని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది. ఓ కేసులో ప్రకాశం జిల్లాకు చెందిన కావటి అలిమేలును అనుమానిస్తూ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆమెను డీఎస్పీ మాధ‌వ‌రెడ్డి మీడియా ముందు హాజరుపర్చారు. అయితే తన తల్లిని మీడియా ముందుకు తీసుకురావడం సరికాదంటూ అలిమేలు కుమారుడు కావటి సాగర్‌ హైకోర్టును ఆశ్రయించారు.  

దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. నిందితుల్ని, అనుమానితుల్ని మీడియా ముందు చూపించే అధికారం పోలీసుల‌కు లేదని స్పష్టం చేసింది. ఒక వేళ నిబంధ‌న‌లుంటే ఏ నిబంధ‌న అనుగుణంగా ఉందో చెప్పాలని తెలిపింది. ఈ అంశంలో కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీస్‌శాఖను ఆదేశిస్తూ.. కేసు విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు