కార్యాలయాల తరలింపు పిటిషన్లపై ఏపీ హైకోర్టు సీరియస్

12 Feb, 2020 17:44 IST|Sakshi

సాక్షి, అమరావతి :  ప్రభుత్వ కార్యాలయాల తరలింపును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ప్రతిష్టను దెబ్బతీసేలా ఏపీ ముఖ్యమంత్రి, అజేయ కల్లం, సజ్జల రామకృష్ణారెడ్డి సహా మరికొందరు కామెంట్లు చేశారంటూ దాఖలైన పిటిషన్లకు సంబంధించి పిటిషనర్లకు హైకోర్టు చీవాట్లు పెట్టింది. వ్యక్తులను ఉద్దేశించి కోర్టుల్లో పిటిషన్లు ఎలా వేస్తారని..ఇలాంటి అభ్యర్థనలు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం ఎలా అవుతుందని న్యాయస్థానం ప్రశ్నించింది. ఇటువంటి అంశాల మీద హైకోర్టు ఎందుకు నోటీసులిస్తుందని... అనుబంధ పిటిషన్‌లోని అంశాలకు, కోర్టుకు ఏమిటి సంబంధమని హైకోర్టు సీరియస్‌ అయింది. కార్యాలయాల తరలింపు పిటిషన్‌పై తదుపరి విచారణను 17కు వాయిదా వేసింది.

ఈ సందర్భంగా సీఎంకు నోటీసులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. వ్యక్తులను ఉద్దేశించి దాఖలు చేసిన అంశాలపై విచారణకు కోర్టులు లేవని మండిపడింది. ఇలాంటి అభ్యర్థనలు పిల్‌ కిందకు రావని, సీఎంకు, అధి​కారులకు నోటీసులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ నోటీసులు ఇస్తే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను దుర్వినియోగం చేసినట్టే అని హైకోర్టు పేర్కొంది.

మరిన్ని వార్తలు