తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

23 Jun, 2018 15:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఉభయ తెలుగురాష్ట్రాల్లో నేటి నుంచి మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో వాయువ్య బంగాళాఖాతంలో ఏ‍ర్పడిన ఉపరిత ఆవర్తనం ఇంకా కొనసాగుతున్నట్లు పేర్కొంది. వర్ష సూచన వివరాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణ
తెలంగాణలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో శని, ఆదివారాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు జల్లులు పడే అవకాశం ఉంది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురవొచ్చు.

ఆంధ్రప్రదేశ్‌
ఏపీలో శని, ఆదివారాల్లో అక్కడక్కడ ఉరుములు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి. సోమవారం కోస్తాలోని చాలా చోట్ల భారీ వర్షాలు నమోదు అయ్యే అవకాశం ఉంది.

రాయలసీమ
ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాయలసీమలో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.

మరిన్ని వార్తలు