నగరంలో సింగపూర్ బృందం పర్యటన

24 Jun, 2015 03:13 IST|Sakshi
నగరంలో సింగపూర్ బృందం పర్యటన

విజయవాడ సెంట్రల్ : నగరంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ (ఘన వ్యర్థాల నిర్వహణ) తీరును సింగపూర్ బృందం మంగళవారం పరిశీలించింది. అజిత్‌సింగ్‌నగర్‌లోని ఎక్సెల్ ప్లాంట్, ట్రాన్స్‌ఫర్ స్టేషన్, చెత్త వేస్ట్ నుంచి కరెంట్ ఉత్పత్తి చేసేందుకు నెల కొల్పిన శ్రీరామ్ ఎనర్జీ ప్లాంట్, జక్కం పూడిలోని డంపింగ్ యార్డును బృంద సభ్యులు తనిఖీ చేశారు.

సంబంధిత అధికారుల నుంచి వివరాలుఅడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్పొరేషన్‌లోని తన చాంబర్‌లో కమిషనర్ జి.వీరపాండియన్‌తో భేటీ అయ్యారు. భవిష్యత్‌లో సైంటిఫిక్ డంపింగ్ యార్డును ఏర్పాటు చేయనున్నట్లు కమిషనర్ వారికి వివరించారు. నగరంలో చేపట్టబోతున్న ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సాలీడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి సింగపూర్ బృందం పలు సూచనలు చేసింది. అదనపు కమిషనర్ జి.నాగరాజు, చీఫ్ ఇంజినీర్ ఎంఏ షుకూర్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ గోపీనాయక్, ఈఈ శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు