గన్నవరం నుంచి ఇండిగో సర్వీసులు

24 Dec, 2017 01:13 IST|Sakshi

విమానాశ్రయం (గన్నవరం): ఇండిగో విమానయాన సంస్థ ఎట్టకేలకు గన్నవరం విమానాశ్రయం నుంచి సర్వీసులు నడిపేందుకు సిద్ధమైంది. వచ్చే ఏడాది మార్చి 2 నుంచి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లకు సర్వీసులు నడపనుంది. ఈ మేరకు ప్రయాణ షెడ్యూ ల్‌ను విడుదల చేయడంతో పాటు టిక్కెట్‌ బుకింగ్‌ కూడా ప్రారంభించింది. ఇండిగో నూతనంగా కొను గోలు చేసిన 74 సీటింగ్‌ కెపాసిటీ కలిగిన ఏటీఆర్‌ 72–600 విమానాలను నడపనుంది. గన్నవరం నుంచి సర్వీసులు నడిపేందుకు ఇండిగో సంస్థ గత ఏడాది కాలంగా సన్నాహాలు చేస్తోంది. ఎట్టకేలకు మార్చి 2 నుంచి సర్వీసులను నడపనున్నట్లు అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. సర్వీసులు ప్రారంభం సందర్భంగా టికెట్‌ ప్రారంభ ధరలను చెన్నైకు రూ.999, హైదరాబాద్‌కు రూ.1,099, బెంగళూరుకు రూ.1,599గా ప్రకటించింది. 

సర్వీసుల వివరాలు
హైదరాబాద్‌ నుంచి ఉదయం 7.35, మధ్యాహ్నం 13.50, రాత్రి 20.10 గంటలకు విమానాలు గన్నవరానికి చేరుకుంటాయి. తిరిగి గన్నవరం నుంచి మధ్యాహ్నం 12.10, సాయంత్రం 18.45, రాత్రి 21.35కు హైదరాబాద్‌ బయలుదేరుతాయి. గన్నవరం నుంచి ఉదయం 8 గంటలకు బయలుదేరి 9.35కు బెంగళూరు చేరుకుని, అక్కడి నుంచి 10.15కు బయలుదేరి 11.50 గంటలకు గన్నవరానికి విమానం చేరుకుం టుంది. గన్నవరం నుంచి మధ్యాహ్నం 15.15కు బయలుదేరి 16.35కు చెన్నైకు చేరుకుంటుంది. తిరిగి చెన్నై నుంచి 16.55కు బయలుదేరి 18.25 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుందని ఇండిగో ప్రతినిధులు తెలిపారు.

మరిన్ని వార్తలు