వెంబడించి మరీ దాడి చేశారు : జర్నలిస్టులు

27 Dec, 2019 13:28 IST|Sakshi

సాక్షి, అమరావతి : రైతుల ముసుగులో కొందరు వ్యక్తులు ఉద్దండరాయునిపాలెంలో జర్నలిస్టులపై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే దాడి నుంచి తప్పించుకునేందుకు యత్నించిన జర్నలిస్టులను వెంబడించి మరీ దాడి చేశారు. కారు అద్దాలను ధ్వంసం  చేయడమే కాకుండా.. వారిపై రాళ్లు రువ్వారు. అంతేకాకుండా వసంత్‌ పర్స్‌, వాచ్‌ కూడా లాక్కున్నారు. ఈ ఘటనలో గాయపడ్డ జర్నలిస్టు వసంత్‌ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ ఘటనలో గాయపడ్డ జర్నలిస్టులు మాట్లాడుతూ.. ‘ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దీక్షను కవర్‌చేయడానికి వెళ్లిన మాపై వందలాంది మంది దాడి దిగారు. మహిళా జర్నలిస్టును రక్షించేందుకు యత్నించగా మాపై పిడి గుద్దులతో దాడి చేశారు. మాపై రాళ్లు విసిరి డబ్బులు, సెల్‌ఫోన్లు లాక్కున్నారు. కారును చుట్టుముట్టి కర్రలతో దాడి చేసి విధ్వంసం సృష్టించారు. మేము మీడియా ప్రతినిధులమని చెప్పిన వినలేదు. ఉద్దండరాయునిపాలెం నుంచి సచివాలయం వైపు వెళ్తుండగా మమ్మల్ని ఆటోల్లో వెండించారు. పోలీసుల దగ్గరికి వెళ్లినా మమ్మల్ని వదల్లేదు. అడ్డుకున్న పోలీసులపై కూడా తిరగబడ్డారు. దాడి చేసినవారంతా బయట నుంచి వచ్చినవారేన’ని తెలిపారు. 

జర్నలిస్టులపై దాడిని ఖండించిన సురేశ్‌..
జర్నలిస్టులపై దాడిని వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగాం సురేష్‌ ఖండించారు. రైతుల ముసుగులో కొందరు వ్యక్తులు ఈ దాడికి యత్నించారని అన్నారు. పోలీసులు ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

చదవండి : రైతుల ముసుగులో జర్నలిస్టులపై దాడి

మరిన్ని వార్తలు