సీమ కోసం జల దీక్ష

3 May, 2015 04:56 IST|Sakshi
సీమ కోసం జల దీక్ష
  • ‘నీరు-చెట్టు’ ప్రారంభోత్సవంలో బాబు
  • సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాయలసీమను సస్యశ్యామలంగా మార్చేందుకు తాను జలదీక్షకు దిగుతానని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. కొందరు శివదీక్ష, మరికొందరు కనకదుర్గ దీక్ష చేస్తారని, అయితే తాను జలదీక్షకు పూనుకుంటానని ఆయ న వివరించారు. రాయలసీమకు సాగునీరు అం దించేవరకు నిద్రపోనని, అవసరమైతే కాల్వల మీదే పడుకుంటానని చెప్పారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని కోటేకల్లు గ్రామంలో శనివారం ఆయన ‘నీరు-చెట్టు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరువును పారదోలేందుకు ‘నీరు-చెట్టు’ ఉపయోగపడుతుందన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు కోటేకల్లుకు వచ్చానన్నారు.

    కర్నూలు జిల్లాకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని నొక్కిచెప్పారు. అనంతరం నీరు-చెట్టు పాటల సీడీని ఆవిష్కరించారు.  మద్యం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం అవసరం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ క్రమంలో కొత్త మద్యం విధానాన్ని తీసుకొస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా బెల్టు షాపులను ఎత్తివేసి మద్యం యజమానుల బెల్టు తీశామని ఆవేశంగా ప్రసంగించారు. అయితే.. ఈ సందర్భంగా ఆస్పరి మండలం బిలేకల్లుకు చెందిన వీరన్న అనే వ్యక్తి సభ మధ్యలో లేచి.. ‘మా ఊర్లో అడుగడుగునా బెల్టు షాపులున్నాయం’టూ వాపోయారు.  బెల్టు దుకాణాలను ప్రోత్సహించే ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా బాబు హెచ్చరించారు.
     
    ఆత్మగౌరవం ఉన్న నటుడు బాలకృష్ణ
    లెజెండ్ విజయోత్సవ సభలో సీఎం
    ఎమ్మిగనూరు: అభిమానం, ఆత్మగౌరవం మెండుగా ఉన్న నటుడు బాలకృష్ణ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం రాత్రి ఎమ్మిగనూరు లో లెజెండ్ సినిమా 400 రోజుల విజయోత్సవ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు