‘జనసేన’ వ్యాన్‌లో మద్యం సీజ్‌ 

8 Apr, 2019 12:07 IST|Sakshi
పోలీస్‌స్టేషన్‌లో సీజ్‌ చేసిన మద్యం బాటిళ్లను పరిశీలిస్తున్న అమలాపురం సీఐ సురేష్‌బాబు

సాక్షి, అంబాజీపేట (పి.గన్నవరం): మద్యం లోడుతో వెళుతున్న వ్యానులో ఉన్న భారీ మద్యం బాటిళ్లను శనివారం అర్ధరాత్రి నోడల్‌ ఆఫ్‌ కాండాక్టు స్వా్కడ్‌ సిబ్బంది, అమలాపురం రూరల్‌ సీఐ జి.సురేష్‌బాబు ఆధ్వర్యంలో ట్రైనీ ఎస్సై డి.సురేష్‌ స్వాధీనం చేసుకున్నారు. సీఐ కథనం ప్రకారం మాచవరం శివారు పోతాయిలంక నుంచి అంబాజీపేట వైపు వెళుతున్న బొలోరో వ్యాన్‌ పోలీసులు గస్తీ చేస్తుంటే, ఒక్కసారిగా వేగంతో దూసుకుపోయింది. అనుమానం వచ్చిన పోలీసులు ఆ వ్యానును నిలిపి తనిఖీ చేశారు. బిల్లులు లేకుండా రవాణా చేస్తున్న రూ.5.50 లక్షల విలువ జేసే 4,795 మద్యం సీసాలు, 624 చిన్న బీరు బాటిళ్ల స్వాధీనం చేస్తున్నారు. రాజోలు మండలం కడలికి చెందిన వ్యాన్‌ డ్రైవర్‌ బోణం సాయి నరసింహమూర్తి, అతనితో ఉన్న అంత్రి రాజేష్‌ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో వ్యాన్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించామన్నారు.

ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. ఈ వ్యాను ఎక్కడ నుంచి వస్తుందో తెలియదని, మామిడికుదురులో వ్యాన్‌ను తనకు అప్పగించారని వ్యాన్‌ డ్రైవర్‌ చెప్పాడని తెలిపారు. అంబాజీపేటలో ఎక్కడికి తీసుకువెళ్లాలో ఫోన్‌ ద్వారా తెలియజేస్తామని చెప్పాడని ట్రైనీ ఎస్సై తెలిపారు. బోడసుకుర్రు వచ్చిన తరువాత సెల్‌ఫోన్‌ కాన్ఫరెన్స్‌లో అంబాజీపేట వైపు రమ్మని చెప్పారన్నారు. వ్యాను ముందు బైక్‌పై ఇద్దరు వ్యక్తులు వెళుతూ ఫోన్‌ కాన్ఫరెన్స్‌లోనే సంభాషించినట్టు తెలిపాడు. ఈ వ్యాన్‌పై జనసేన స్టిక్కర్‌ ఉండటంతో పలు అనుమానాలకు తావిస్తోంది. 


 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వేలూరు లోక్‌సభకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

కుటుంబ కథా చిత్రం!

ఒక్కో ఓటుపై రూ.700

అలా అయితే ఫలితాలు మరోలా ఉండేవి: పవన్

రాజ్‌నాథ్‌ రాజీనామాకు సిద్ధపడ్డారా?

రెండు చోట్ల అందుకే ఓడిపోయా: పవన్‌

గడ్కరీ ఓడిపోతాడు.. ఆడియో క్లిప్‌ వైరల్‌!

సీఎంతో విభేదాలు.. కేబినెట్‌ భేటీకి డుమ్మా!

నిస్సిగ్గుగా, నిర్లజ్జగా కొంటున్నారు

మాయ, అఖిలేష్‌ల ఫెయిల్యూర్‌ స్టోరీ

అంతా మీ వల్లే

బాబు వైఎస్సార్‌సీపీలోకి వెళితే నేను..

కేశినేని నాని కినుక వెనుక..

కొన్నిసార్లు అంతే.. !!

ఎంపీ కేశినేని నానితో గల్లా భేటీ

‘మాతో పెట్టుకుంటే పతనం తప్పదు’

టీడీపీకి ఎంపీ కేశినేని నాని షాక్‌!

చీఫ్‌ విప్‌గా మార్గాని భరత్‌ రామ్‌

‘మహాఘఠ్‌ బంధన్‌’ చీలిపోయింది...

గిరిరాజ్‌కు అమిత్‌ షా వార్నింగ్‌