విద్యతోనే మహిళలకు హక్కులపై అవగాహన

28 Dec, 2013 02:03 IST|Sakshi

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్
 
 రాజమండ్రి, న్యూస్‌లైన్:  స్త్రీలు విద్యావంతులైనప్పుడే తమ హక్కులపై సమగ్ర అవగాహనను ఏర్పరచుకోగలరని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. శుక్రవారం  రాజమండ్రిలో అద్దేపల్లి శ్రీధర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘స్త్రీలు- రాజ్యాంగపరమైన హక్కులు’ అంశంపై జరిగిన సదస్సుకు జస్టిస్ చలమేశ్వర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం స్త్రీలకు విద్య, ఉపాధి, ఆస్తి మొదలైన అంశాల్లో సమాన హక్కు కల్పించిందన్నారు. అయినా ఆ హక్కులను మహిళలు పూర్తిస్థాయిలో వినియోగించుకోలేక పోవడానికి అనేక సామాజిక కారణాలు ఉన్నాయన్నారు. మన దృక్పథంలో మార్పు రావలసిన అవసరం ఉందని సూచించారు. వివిధ రంగాల్లో నిష్ణాతులయిన మహిళలను ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అద్దేపల్లి శ్రీధర్ సత్కరించారు.
 

మరిన్ని వార్తలు