మోకాలు లోతు నురగ నీటిలో ఛఠ్ పూజలు

20 Nov, 2023 12:43 IST|Sakshi

ఢిల్లీ: యమునా నదిలో కలుషిత నీటిలోనే భక్తులు నేడు ఛఠ్ పూజలు నిర్వహించారు. కాళింది కుంజ్ వద్ద మోకాలు లోతు నురగ నీటిలో మహిళలు సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. యమునా నది కలుషిత నీటిపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

నాలుగు రోజుల పాటు సాగిన ఛఠ్‌ పూజా వేడుకల ముగింపు సందర్భంగా దేశవ్యాప్తంగా భక్తులు సోమవారం ఉదయం సూర్యునికి అర్ఘ్యం సమర్పించారు. యమునా నదిలో నురగలు వస్తున్నప్పటికీ తప్పనిస్థితిలో భక్తులు పూజా కార్యక్రమాలు చేశారు. అయితే.. యమునా నది నీటిలో అధిక పాస్పేట్ స్థాయిల కారణంగా నురగ నీరు ప్రవహిస్తోంది.  యూపీ, హర్యానా సహా చుట్టుపక్కల రాష్ట్రాల పరిశ్రమల నుంచి కలుషిత నీరు ప్రవహిస్తోంది. ఈ కారణంగా నది నీటిలో పాస్పేట్ స్థాయిలు అధికంగా ఉన్నాయి. 

ఛఠ్ పూజా కార్యక్రమాలు ప్రతి ఏడాది దేశ రాజధాని ఢిల్లీతో పాటు బిహార్, యూపీ, జార్ఖండ్, బెంగాల్ రాష్ట్రాల్లో జరుగుతాయి. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. నాలుగు రోజులపాటు జరుగుతున్న ఛఠ్ పండుగ శుక్రవారం ప్రారంభమైంది. స్వచ్ఛత,  సద్భావన, విశ్వాసాలకు నిలయంగా ఈ పండుగను జరుపుకుంటారు.

ఇదీ చదవండి: Delhi Schools: ఢిల్లీలో తెరుచుకున్న విద్యాసంస్థలు

మరిన్ని వార్తలు