భారతావనికే ఆదర్శం కాకతీయుల పాలన

22 Dec, 2013 07:11 IST|Sakshi

హన్మకొండ చౌరస్తా, న్యూస్‌లైన్ :  కాకతీయుల పాలన యావత్ భారతదేశానికే ఆద ర్శం.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కాకతీ య ఉత్సవాలు ఇక నుంచి ప్రతి ఏటా డిసెంబర్ 20, 21, 22 తేదీల్లో ఘనంగా నిర్వహిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. కాకతీయ ముగింపు ఉత్సవా ల్లో భాగంగా రెండో రోజు కార్యక్రమాలు వేయిస్తంభాల గుడి లో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథి గా హాజరైన మంత్రి మాట్లాడుతూ ప్రజా సంక్షేమం. కళా సాహిత్య రంగాల అభివృద్ధికి కాకతీయులు చేసిన సేవలు భావితరాలకు మార్గదర్శకం కావడానికి ఈ ఉత్సవాలు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. తెలంగాణ పునఃర్నిర్మాణంలో కవులు, కళాకారులు, మేధావులు సహకరించాలని కోరారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి వారసత్వ ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు.
 
 విషిష్ట అతిథిగా హాజరైన ఎంపీ రాజయ్య మాట్లాడుతూ కాకతీయుల పాలన స్ఫూర్తి దాయకమని పేర్కొన్నారు. తన నిధుల నుంచి వరంగల్ కోట అభివృద్ధికి రూ.5 కోట్లు, రామప్ప పరిరక్షణకు రూ.5.80 కోట్లు, గణపురం కోటగుళ్లకు రూ.3.50 కోట్లు, పాండవుల గుట్ట కు రూ.1.50కోట్లు, చేర్యాల, పెంబర్తి హస్త కళాకారుల అభివృ ద్ధి కోసం రూ.50 లక్షలు మంజూరు చేయించానని తెలిపారు. చట్టసభల్లో మన వాటాకోసం పోరాడి సాధించుకుందామని అన్నారు. ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ కాకతీయ ఉత్సవాల కోసం నిర్వహించిన రివ్యూలో జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు ముందు రూ.300కోట్లు విడుదల చేయాలని కోరితే గుడ్డి, చెవిటి చేతకాని సీమాంధ్ర ప్రభుత్వం ముష్టి రూ.30లక్షల ఇచ్చిందని విమర్శించారు. శ్రీకృష్ణ దేవరాయుల ఉత్సవాల కోసం రూ.300కోట్లు కేటాయించి, తపాల బిళ్ల సైతం విడుదల చేసిన సర్కారు కాకతీయ ఉత్సవాలపై నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో కాకతీయ ఉత్సవాలు ఘనంగా జరుపుకుందామని చెప్పారు. కార్యక్రమంలో వేయిస్తంభాల ఆల య ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్ర శర్మ, ప్రముఖ నవ లా రచయిత అంపశయ్య నవీన్, ఏపీఆర్‌ఓ శ్రీనివాస్, పులి రజినీకాంత్, వరంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మందా వినోద్‌కుమార్, ఇతర ప్రముఖులు పాల్గొనగా వ్యాఖ్యాతగా వల్స పైడి వ్యవహరించారు.
 
 శిల్ప కళావైభవం అద్భుతం
 ఖిలావరంగల్ : కాకతీయుల శిల్ప కళావైభవం అద్భుతమని మంత్రి బస్వరాజ్ సారయ్య పేర్కొన్నారు. శనివారం ఖిలావరంగల్ మధ్యకోటలో జరిగిన కాకతీయ ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నేడు చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించి సముచిత స్థానం కల్పిస్తున్నామని, కాకతీయులు నాడే రాణి రుద్రమదేవికి రాజ్యాధికారం అప్పగించి మహిళలకు పెద్ద పీట వేశారని చెప్పారు. ఎంపీ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ వరంగల్ ఘన కీర్తిని ఢిల్లీలో చెప్పుకుంటారని అన్నారు.
 
 చారిత్రక కట్టడాల పరిరక్షణకు రూ.కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధి చేశామన్నారు. తెలంగా ణ ప్రాంత రాజకీయ నాయకులు కలిసి కట్టుగా ముందు సాగి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి మాట్లాడుతూ కాకతీయ ఉత్సవాలకు నిధుల కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం సవతి ప్రేమ చూపించిందని, ప్రత్యేక రాష్ర్టం ఏర్పాటైన తర్వాత వరంగల్‌కోట సమగ్ర అభివృద్ధి కోసం అధిక నిధులు కేటాయించాలని కోరారు. జెడ్పీ సీఈఓ ఆంజనేయులు మాట్లాడుతూ విద్యార్థులు కాకతీయులు కట్టడానికి వినియోగించిన టెక్నాలజీని గమనించి వారి తీపిగురుతుగా గుర్తుంచుకోవాలన్నారు. వరంగల్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మంద వినోద్‌కుమార్ మాట్లాడుతూ కాకతీయులు గొప్ప కళాకారులు, శిల్పులని కొనియాడారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, మాజీ కౌన్సిలర్ సిరబోయిన కృష్ణ, బిల్లశ్రీకాంత్, యాకయ్య, జీవన్‌గౌడ్, గైడ్స్ రవియాదవ్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు