గెలిపించండి.. అండగా ఉంటా

25 Mar, 2019 15:04 IST|Sakshi
మల్లి శ్రీనివాసులు ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారితో సంజీవయ్య 

వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య  

సాక్షి, సూళ్లూరుపేట: ‘ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించండి.. అండగా ఉంటా’ అని సూళ్లూరుపేట ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య నియోజకవర్గ ప్రజలను కోరారు. వడ్డెర సంఘం జిలా ఉపా«ధ్యక్షులు మల్లి శ్రీనివాసులు ఆధ్వర్యంలో సుమారు 200 మంది పార్టీలో ఆదివారం పట్టణంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. అలాగే సన్నారెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి, (స్వామిరెడ్డి) ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు వాసంరెడ్డి వేణుగోపాల్‌రెడ్డి, సూళ్లూరుకు చెందిన యూత్‌ సుమారు వందమంది పార్టీలో చేరారు. వారికి సంజీవయ్య కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్వామిరెడ్డి ఇంటివద్ద పార్టీ పట్టణ అధ్యక్షులు కళత్తూరు శేఖర్‌రెడ్డి ఆధ్యక్షతన జరిగిన సమావేశంలో కిలివేటి మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిపిస్తే కాళంగి గ్రాయిన్, నెర్రికాలువ లిఫ్ట్‌ ఇరిగేషన్, తెలుగుగంగ బ్రాంచ్‌ కాలువలను పూర్తి చేయించడం, సూళ్లూరుపేట, నాయుడుపేట పట్టణాలకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకువచ్చి భూగర్భ డ్రెయినేజీ నిర్మించేందుకు కృషి చేస్తానని చెప్పారు.

కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కట్టా సుధాకర్‌రెడ్డి, ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వేణుంబాక విజయశేఖర్‌రెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, ఓజలి సుబ్బారావు, భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి దబ్బల శ్రీమంత్‌రెడ్డి, మండల అధ్యక్షులు అల్లూరు అనిల్‌కుమార్‌రెడ్డి, జిల్లా కార్యదర్శిలు ఎం.పాండురంగయాదవ్, చాంపియన్‌ చంద్రారెడ్డి, వేనాటి సుమంత్‌రెడ్డి, ముత్తుకూరు లక్ష్మమ్మ, అలవల సురేష్, వంకా చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు