నేనేం చేస్తానో సభలో చెప్తా: సీఎం కిరణ్

9 Jan, 2014 04:44 IST|Sakshi
నేనేం చేస్తానో సభలో చెప్తా: సీఎం కిరణ్

 చర్చ జరగకపోతే బిల్లునుఅంగీకరించినట్లే
 అభిప్రాయాలు చెప్పకపోతే ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా జరుగుతుంది
 వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీలు బిల్లుపై చర్చలో పాల్గొనాలి

 
 సాక్షి, హైదరాబాద్: శాసనసభ, వుండలిలో సభ్యులు అభిప్రాయూలు చెప్పకుండా రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లును తిరిగి పంపిస్తే ప్రజల ఆకాంక్షకు భిన్నంగా జరుగుతుందని వుుఖ్యవుంత్రి నల్లారి కిరణ్‌కువూర్‌రెడ్డి అభిప్రాయుపడ్డారు. సమైక్య రాష్ట్రం విషయంలో చిత్తశుద్ధి ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు సభలో చర్చలో పాల్గొని తవు అభిప్రాయూలు చెప్పాలని వ్యాఖ్యానించారు. చర్చ జరగకపోతేనే బిల్లును అంగీకరించినట్లు అవుతుందన్నారు. సీఎం కిరణ్ బుధవారం క్యాంపు కార్యాలయుంలో మీడియూతో వూట్లాడారు. ‘‘మేవుు ఎంత వ్యతిరేకించినా విభజన బిల్లు ముసాయిదాను అసెంబ్లీకి పంపారు. శాసనసభలో, మండలిలో దీనిపై పూర్తి అభిప్రాయాలు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది. సమైక్యం మా విధానమని స్పష్టంగా చెప్తూ వచ్చాం. అసెంబ్లీలోనూ అదే చెప్తాం’’ అని పేర్కొన్నారు.
 
 వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీలు రాష్ట్ర విభజనపై గతంలో వేర్వేరు అభిప్రాయూలు చెప్పినా ముసాయిదా బిల్లులో సమైక్య ఆంధ్రప్రదేశ్‌పై స్పష్టమైన వైఖరి చెప్పాలని కిరణ్ సూచించారు. బయట ఎన్ని అభిప్రాయాలున్నా అసెంబ్లీలో చెప్పే అభిప్రాయాలకు ప్రాముఖ్యత ఉంటుందన్నారు. సభలోని అభిప్రాయాలను అనుసరించి రాష్ట్రపతి, పార్లమెంటు నిర్ణయం తీసుకునే అవకాశవుుంటుందని చెప్పారు. ‘‘మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని శాసనసభ అభిప్రాయంగా రాష్ట్రపతికి పంపే అవకాశం ఉంది. మీరంతా కలిసి రండి’’ అని సీఎం కోరారు. బిల్లుపై చర్చ జరిపి అసెంబ్లీ, వ్యక్తిగత అభిప్రాయాలను తెలియజేస్తే రాష్ట్రపతి కచ్చితంగా పరిగణలోకి తీసుకుంటారన్నారు. తనకు తెలిసినంత వరకు అసెంబ్లీ భిన్నాభిప్రాయూలు తెలిపాక రాష్ట్రాల విభజన జరగలేదని ఒక ప్రశ్నకు సవూధాన ంగా పేర్కొన్నారు. ఇప్పటివరకు ఏకాభిప్రాయుం మేరకే విభజన జరిగిందన్నారు. వీటిపై అసెంబ్లీలో వూట్లాడతానని చెప్పారు.
 
 ఇంకా వారం సమయం ఉంది కదా..!
 
 ‘బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం పెడతారాా?’ అని ప్రశ్నించగా.. ‘‘నేనేం చేస్తానో, ఏం చెప్తానో అసెంబ్లీలోనే చూస్తారు కదా! ఇంకా వురో వారం సమయం ఉంది కదా!’’ అని సీఎం కిరణ్ బదులిచ్చారు. అసెంబ్లీలో ఏ బిల్లుపైనైనా ఓటింగ్ ఉంటుందని, అభిప్రాయూలు ఓటింగ్ ద్వారానే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ‘బిల్లును వెనక్కు పంపే అధికారం సీఎంగా మీకు ఉంటుంది కదా?’ అని అడిగితే.. ‘‘నా అధికారాలు నాకు వదిలేయండి. సభలో వారి (వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ) అభిప్రాయమేమిటో చెప్పిన తరువాతే ఒక నిర్ణయం తీసుకుంటాం’’ అని సమాధానం చెప్పారు. ‘‘కేంద్రం రాజ్యాంగాన్ని పరిగణనలోకి తీసుకోకుండా బిల్లును ఎందుకు పంపుతుంది? ఆ బిల్లును ఈ అసెంబ్లీకి కాకుండా తమిళనాడుకో, కర్ణాటకకో పంపొచ్చు కదా! ఆంధ్రప్రదేశ్ సభ్యుల అభిప్రాయాలను తెలుసుకోవడానికే పంపించారంటే రాజ్యాంగం ప్రకారం దాని తూకం కచ్చితంగా ఉంటుంది. అంతకుమించి బిల్లు గురించి ఏమీ మాట్లాడవద్దు’’ అని కిరణ్ వ్యాఖ్యానించారు. ‘‘అదనపు సవుయుం అవసరవూ లేదా అన్నది చర్చ జరిగితేనే కదా? ఇతర రాష్ట్రాల మాదిరిగా రెండు, మూడు రోజుల్లో చర్చ పూర్తయితే బాధ లేదు. లేకుంటే అప్పుడు మళ్లీ నిర్ణయం తీసుకుంటాం’’ అని చెప్పారు.
 
 

మరిన్ని వార్తలు