వైఎస్సార్ సీపీలో 200 మంది చేరిక | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీలో 200 మంది చేరిక

Published Thu, Jan 9 2014 4:42 AM

వైఎస్సార్ సీపీలో 200 మంది చేరిక - Sakshi

 ముదిగొండ, న్యూస్‌లైన్: మండల పరిధిలోని కట్టకూరు, సీతారామాపురం గ్రామాలలోని వివిధ పార్టీల నుంచి 200 మంది బుధవారం వైఎస్‌ఆర్ సీపీలో చేరారు. ఖమ్మంలోని  పార్టీ కార్యాలయంలో వైఎస్‌ఆర్ సీపీ ఖమ్మం పార్లమెంటరీ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. కట్టకూరు సర్పంచ్ శెట్టిపల్లి రమాదేవి, ఉప సర్పంచ్ కొమ్ము ఉపేందర్, మేడేపల్లి గ్రామ కన్వీనర్, వైఎస్‌ఆర్ సీపీ నాయకులు జూలకంటి సంజీవరెడ్డి ఆధ్వర్యంలో సీపీఎం, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలవారు వైఎస్సార్‌సీపీలో చేరారు. వారికి పొంగులేటి పార్టీ కండువా లు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
 
 ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ యువత పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన వివిధ రకాల సంక్షేమ పథకాలే పేదలకు శ్రీరామరక్షగా నిలిచాయని గుర్తుచేశారు.  ప్రతి పేదవాని గుండెలో వైఎస్‌ఆర్ పదిలంగా ఉన్నారని అన్నారు. కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు.  ప్రతి పల్లెలో ప్రతి ఇంటిపై వైఎస్‌ఆర్ సీపీ జెండా ఎగరాలని అన్నారు.  పార్టీలో చేరినవారిలో వట్టె వీరభద్రం, వడ్డెబోయిన సంఘయ్య, రాగం వెంకటనారాయణ, రాగం కొండయ్య, జైపాల్‌రెడ్డి, రాగం వెంకటేశ్వర్లు, పాకనాటి మంగిరెడ్డి, దనియాకుల శ్రీ ను, ఉపేందర్, చిననాగయ్య, రాగం నాగేశ్వరరావు, వెంకటప్పయ్య, సైదయ్య, ఎస్‌కె బాబా తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర సేవాదళ్ నాయకులు దారెల్లి అశోక్, జిల్లా నాయకురాలు డాక్టర్ సామాన్యకిరణ్, మండల కన్వీనర్ మరికంటి గురుమూర్తి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మోర్తాల నాగార్జునరెడ్డి, కమలాపురం సర్పంచ్ బత్తుల వీరారెడ్డి, నాయకులు శెట్టిపల్లి రామరావు, కొత్తపల్లి వెంకన్న, పాదర్తి రాంప్రసాద్, రఫీ, సంజీవరెడ్డి, మట్టా గోవిందరెడ్డి పాల్గొన్నారు.
 
 రైతులకు పరిహారం ఇవ్వాలి
 చింతకాని: ఖరీఫ్ సీజన్‌లో వర్షాలకు, నకిలీ విత్తనాలతో పంటలను నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.  పంటనష్ట పరిహారం కోసం పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో ఆందోళన కార్యక్రమాలను చేపట్టినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.  జిల్లాలో సాగర్‌ఆయకట్టుకు రెండో పంటకు పూర్తిగా సాగునీరు అందించాలని కోరారు.  
 
 జిల్లాలో సాగునీటి సమస్యలను తీర్చేందుకు  జలయజ్ఞం కింద మహానేత వైఎస్సార్ దుమ్ముగూడెం, రాజీవ్, ఇందిరా సాగర్ సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్మాణాలు చేపట్టారని గుర్తుచేశారు. ఆయన మరణానంతరం ఏళ్లు గడిచినా  పనుల్లో పురోగతి లేదని  విమర్శించారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్ట్‌లు పూర్తిచేయాలన్నా, వైఎస్‌ఆర్ కలలను నెరవేర్చాలన్నా ఒక్క జగన్‌తో సాధ్యమవుతుందనే విశ్వాసం ప్రజల్లో ఉందన్నారు.  జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ లతో పాటు అన్ని వర్గాల ప్రజలు వైఎస్‌ఆర్ కుటుంబానికి అండగా ఉన్నారని చెప్పటానికి పంచాయతీ ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయాలే నిదర్శనమని తెలిపారు. కాంగ్రెస్, టీడీపీ నాయకులు ప్రజల్ని మభ్యపెట్టడం తప్ప అభివృద్ధి చేసిందేమి లేదన్నారు. సమావేశంలో  పార్టీ సేవాదళ్ రాష్ట్ర కమిటీ సభ్యులు దారె ల్లి అశోక్‌కుమార్, నాయకురాలు సామాన్యకిరణ్, మండల కన్వీనర్ కొప్పుల నాగేశ్వరరావు, స్టీరింగ్ కమిటీ సభ్యులు కత్తుల శ్యామలారావు, మర్రి ప్రకాష్, మధిర, బోనకల్ మండలాల కన్వీనర్లు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement