'సీఎం కిరణ్ ను వెంటనే తొలగించాలి:కాంగ్రెస్ ఎమ్మెల్యే

26 Sep, 2013 18:33 IST|Sakshi

హైదరాబాద్:సీఎం కిరణ్ కుమార్ రెడ్డి క్యాంప్ ఆఫీసుకే పరిమితమవుతున్నారని కాంగ్రెస్ పార్టీ చెందిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఎద్దేవా చేశారు. సమైక్య సమ్మెతో ప్రభుత్వ స్కూళ్లు మూతబడుతున్న సంగతి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఒక ప్రక్క స్కూళ్లు మూతబడుతున్నా సీఎం క్యాంప్ ఆఫీసుకే పరిమితమవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సీమాంధ్ర ఉద్యమంతో పేదల ఉపాధికి ఆటంకం కలుగుతున్నా, సీఎం మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. బాధ్యతలను విస్మరించిన సీఎంను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

 

ఢిల్లీలో అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై , ఇక్కడ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వ్యవరిస్తున్న తీరుపై పలువురు నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచుతామని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసేవరకూ ఉద్యమం ఆగేది లేదని సీమాంధ్ర ప్రజ తెగేసి చెబుతుంటే సీఎం ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగుజాతిని ముక్కలు చేస్తే సహించేది లేదని సమైక్య వాదుల నినదిస్తూ ముందుకు సాగుతున్నారు. వరుసగా 57వరోజూ బుధవారం సమైక్యవాదుల ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, వినూత్న ఆందోళనలతో కోస్తా, రాయలసీమ జిల్లాలు దద్దరిల్లాయి.

 

మరిన్ని వార్తలు