బెజవాడలో ఐఏఎస్‌ అధికారి సోదరి అదృశ్యం

3 Aug, 2017 11:13 IST|Sakshi
బెజవాడలో ఐఏఎస్‌ అధికారి సోదరి అదృశ్యం

విజయవాడ:  నగరంలోని మాచవరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మహిళా వైద్యురాలు సూర్యకుమారి అదృశ్యం కలకలం రేపుతోంది. కృష్ణాజిల్లా విస్సన్నపేటలోని ఓ ఆస్పత్రిలో ఆమె వైద్యురాలిగా పని చేస్తోంది. అదృశ్యమైన సూర్యకుమారి కర్ణాటక క్యాడర్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఐఏఎస్‌ అధికారి సోదరిగా సమాచారం.  కుటుంబసభ్యుల ఫిర్యాదు నేపథ్యంలో ఆమె అదృశ్యంపై తూర్పు మాజీ ఎమ్మెల్యే జయరాజ్‌ కుమారుడు విద్యాసాగర్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

కాగా సూర్యకుమారి రెండు రోజుల క్రితం విద్యాసాగర్‌ ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతడి ఇంట్లో సోదాలు చేపట్టి సీసీ టీవీ ఫుటేజ్‌ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కాగా విద్యాసాగర్‌ తల్లి మాట్లాడుతూ... రెండ్రోజుల క్రితం సూర్యకుమారి తన ఇంటికి వచ్చారని, అయితే ఆమె అక్కడ నుంచి వెంటనే వెళ్లిపోయినట్లు తెలిపారు. కాగా అటు మాజీ ఎమ్మెల్యే, ఇటు ఐఏఎస్‌ అధికారి కుటుంబాలు కావడంతో పోలీసులు ఈ కేసులో గోప్యత పాటిస్తున్నారు ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు