బాదుడుకు రెడీ!

10 Jul, 2015 00:10 IST|Sakshi

 విజయనగరం రూరల్: వచ్చే నెల 1 వ తేదీ నుంచి  భూముల విలువను భారీగా పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.  స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ నుంచి అధికాదాయం పొందడానికి   ప్రస్తుత ధరలపై సరాసరిన 30 శాతం పెంచనుంది. దీంతో జిల్లా వాసులపై రూ. 25 కోట్ల   భారం పడనుంది. భూముల విలువల పెంపుపై అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీనిపై రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ధరలపై అత్యధికంగా వంద శాతం వరకు, బహిరంగ మార్కెట్ విలువల్లో అత్యధికంగా 60 శాతం వరకూ పెంచడానికి చర్యలు చేపట్టారు.  

ధరలపై క మిటీలు సూచించిన అంశాలు, ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనలను ప్రభుత్వానికి పంపించి తుది నిర్ణయం తీసుకుంటారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి స్టాంప్స్ ఆండ్ రిజిస్ట్రేషన్ శాఖ లక్ష్యం రూ.148 కోట్లు   కాగా,  భూముల మార్కెట్ విలువతో రిజిస్ట్రేషన్ శాఖకు అదనంగా మరో రూ. 25 కోట్లు  చేకూరనుంది.  అలాగే ఇప్పటి వరకు మెట్టు, పల్లం భూములకు వేర్వేరు మార్కెట్ విలువలుండగా, దీనిపై అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో రెం డు రకాల భూములకు ఒకే విధమైన విలువ ఉండేలా ధరలు నిర్ణయించడానికి వీలుగా   కమిటీల ద్వారా ప్రభుత్వానికి నివేదికలు అందజేయనున్నారు.
 

మరిన్ని వార్తలు