ఒంగోలుపై కేంద్రకృతమైన అల్పపీడనం

24 Oct, 2013 10:18 IST|Sakshi

విశాఖ : పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి వాయువ్య దిశగా  ఒంగోలుపై  అల్పపీడనం కేంద్రీకృతమై ఉన్నట్లు విశాఖపట్నం వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా తీరాన్ని ఆనుకొని పశ్చమి మధ్య బంగాళాఖాతంలో  అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా అదే పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం నెలకొంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలలో అల్పపీడన ప్రభావం అధికంగా ఉండనుంది. మరోవైపు ఈశాన్య రుతుపవనాలు కూడా గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభావం చూపటంతో రాష్ట్రంలో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. మరోవైపు భారీ వర్షాలతో  వాగులు పొంగిపొర్లుతున్నాయి. కాగా సముద్రంలోకి వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
 

మరిన్ని వార్తలు