నేడు విశాఖ సౌత్, బనగానపల్లి, ఒంగోలులో సామాజిక సాధికార యాత్ర 

22 Nov, 2023 08:52 IST|Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జరిగిన మేలు­ను, సామాజికన్యాయం, రాజ్యాధికారం పొందిన వైనాన్ని ప్రజలకు వివరించేందుకు వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర బుధవారం విశాఖపట్నం జిల్లా విశాఖ సౌత్, నంద్యాల జిల్లా బనగానపల్లి, ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహిస్తారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. నాలుగున్నర సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేసిన పలు కార్యక్రమాలను పేదలకు వివరిస్తారు.  

విశాఖపట్నం:
విశాఖపట్నం సౌత్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరగనుంది. ఉదయం 11:30 గంటలకు ఫార్చున్ ఇన్ హోటల్‌లో వైఎస్సార్‌సీపీ నాయకుల మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు డైమండ్ పార్క్ నుంచి రైల్వే న్యూ కాలనీ, మనోహర థియేటర్, దుర్గాలమ్మ గుడి, జగదాంబ జంక్షన్ మీదుగా టౌన్ కొత్త రోడ్డు వరకు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించనున్నారు. 2:30 గంటలకు టౌన్ కొత్త రోడ్డులో జరగనున్న బహిరంగ సభలో రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి,  మంత్రులు వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజు, బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్, తదితరులు హాజరుకానున్నారు.

ఒంగోలు:
ఒంగోలులో మాజీ మంత్రి  బాలినేని శ్రీనివాసరెడ్డి  ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరగనుంది. మధ్యాహ్నం 1 గంటకు ఒంగోలు నోవాసిస్ హోటల్‌లో వైఎస్సార్‌సీపీ నేతల విలేకర్ల సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు కర్నూల్ రోడ్డు బైపాస్ నుండి బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వరకు ర్యాలీ సాగనుంది. 4 గంటలకు బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద నిర్వహించనున్న బహిరంగ సభలో రీజనల్ ఇంఛార్జ్ విజయసాయిరెడ్డి, ఎంపీ ఆర్.కృష్ణయ్య, మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, విడదల రజని, తదితరులు హాజరుకానున్నారు.

నంద్యాల జిల్లా:
నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర సాగనుంది. బనగానపల్లె ధనలక్ష్మి ఫంక్షన్ హాలులో ముస్లిం మైనారిటీలతో సమావేశం నిర్వహించనున్నారు. ఒంటిగంటకు వైఎస్సార్‌సీపీ నేతల మీడియా సమావేశం అనంతరం కూరగాయల మార్కెట్ మీదుగా పెట్రోల్ బంకు సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే బహిరంగ సభలో ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ, మంత్రులు నారాయణ స్వామి, అంజాద్ భాషా, మాజీ మంత్రి పార్థసారథి హాజరుకానున్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega