అదృశ్యం కేసులో దోషులను శిక్షించాలి

11 Dec, 2013 04:02 IST|Sakshi
 వెంకటాపురం, న్యూస్‌లైన్: మండలంలోని వీఆర్‌కేపురం గ్రామానికి చెందిన డర్రా రాధ, డర్రా పోతురాజుల అదృశ్యం కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ మంగళవారం వెంకటాపురంలో ప్రజలు భారీ ప్రదర్శన నిర్వహించారు. స్థానిక పోలీసులు ఈ కేసులో దోషులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రదర్శనలో వీఆర్‌కేపురం, చొక్కాల, ఇప్పలగూడెం గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.   
 
 న్యాయం చేయాలంటూ నిరసన దీక్షలు ప్రారంభం
 రాధ, పోతురాజుల అదృశ్యానికి కారణమైన వారికి అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, తమకు న్యాయం చేయాలని కోరుతూ రాధ, పోతురాజుల తల్లిదండ్రులు మల్లయ్య, గంగ, లక్ష్మయ్య, నాగమ్మలు వెంకటాపురం మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్‌ళో నిరసన దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను వెంకటాపురం సర్పంచ్ బెజ్జరి నారాయణమ్మ ప్రారంభించి మాట్లాడారు. బాధితులకు వైఎస్సార్‌సీపీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని, సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం చేస్తుందని ఆమె అన్నారు. ఈ నిరసన దీక్షలకు వైఎస్సార్‌సీపీ, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ పార్టీల నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు చిడెం శివ, సయ్యద్‌హుస్సేన్, కాంగ్రెస్ నాయకులు మంగాయమ్మ, సీతాదేవి, సీపీఐ నాయకులు తోట మల్లిఖార్జునరావు, సీపీఎం నాయకులు గ్యానం సారయ్య, ఏసురత్నం పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు