అచ్చెన్నాయుడు డైరెక్టర్లను బెదిరించారు: హొంమంత్రి

15 Jun, 2020 14:15 IST|Sakshi

సాక్షి, గుంటూరు: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎదోలా బురద జల్లటమే పనిగా పెట్టుకున్నారని హోంమంత్రి మేకతొటి సుచరిత మండిపడ్డారు. సోమవారం సుచరిత మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును పార్టీ మారమన్నామని అనటం సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు. తాము ఎవరినీ పార్టీలోకి ఆహ్వానించటం లేదన్నారు. అచ్చెన్నాయుడు స్వయంగా డైరెక్టర్లను బెదిరించి అక్రమాలకు పాల్పడ్డారని, నిబంధనలకు విరుద్దమని డైరెక్టర్లు చెప్పినా వినిపించుకోలేదన్నారు. (‘రానున్న రోజుల్లో మరిన్ని అరెస్టులు’)

మంత్రిని నేనా? మీరా? అని డైరెక్టర్లను బెదిరించినట్లు సుచరిత పేర్కొన్నారు. సాక్ష్యాలన్నీ దొరికాకే అందరిని అరెస్టు చేశామని, ఈ కేసులో ఇంకొంతమంది పెద్దల ప్రమేయం కూడా ఉందన్నారు. విచారణలో అన్ని తేలుతాయని, మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబం చేసిన అక్రమాలు చాలనే ఉన్నాయన్నారు. ఇన్సూరెన్స్‌ లేని బస్సులు తిప్పి మనుషుల ప్రాణాలతో చెలగాటమాడి ఇప్పుడు నీతులు చెప్తే ఎవరూ నమ్మరని మంత్రి విమర్శించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు