భూప్రకంపనలపై అప్రమత్తమైన యంత్రాంగం

25 Feb, 2015 11:39 IST|Sakshi

ఒంగోలు: ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలపై ఇంఛార్జీ కలెక్టర్ హరి జవహర్ లాల్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. భూ ప్రకంపనలు వచ్చిన ప్రాంతాల నుంచి వివరాలు సేకరించాలని ఆదేశాలు జారీ చేశారు. జియాలజిస్ట్ లతో చర్చించి ప్రకంపనలకు గల కారణాలు తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. తమ ఇంట్లో కూడా సుమారు 3 సెకన్ల పాటు భూమి కంపించినట్లు గుర్తించామని ఆయన పేర్కొన్నారు. ఈ సంఘటనతో జిల్లాలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని హరి జవహర్ లాల్ తెలిపారు.

గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో బుధవారం తెల్లవారుజామున భూమి స్వల్పంగా కంపించింది. ప్రకాశం జిల్లా  ఒంగోలు, అద్దంకి, కొరిశపాడు తదితర ప్రాంతాల్లో, మరోవైపు గుంటూరు జిల్లాలోనూ చిలకలూరి పేట మండలం మద్ధిరాల, రాజాపేట, ఎడవల్లి, మురికిపూడి గ్రామాల్లో భూప్రకంపనలు వచ్చాయి.

మరిన్ని వార్తలు