మట్టి మూకుడు రొట్టె రుచే వేరు..

29 Sep, 2019 11:58 IST|Sakshi

50 ఏళ్లుగా రొట్టె ఫేమస్‌

సాక్షి, అంబాజీపేట: ప్రస్తుత కాలంలో ప్రతీ ఒక్కరూ ఫిజా.. బగ్గర్‌లు.. పాస్ట్‌ ఫుడ్‌ వైపు చూస్తున్నారు. కాని కోనసీమలో మాత్రం మూకుడు రొట్టె కోసం ప్రియిలు సాయంత్రం సమయంలో మూకుడు రొట్టె కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఉదయం పూట ప్రతీ ఒక్కరూ ఆల్ఫాహారం తీసుకోవడం సర్వసాధరణం. ఇడ్లీ, పూరీ, బజ్జీ, గారె తదితరవి అల్పాహారాలు తీసుకుంటాం. చల్లని సాయంత్రం సమయంలో వేడే వేడి మూకుడు రొట్టె, పైగా మట్టి మూకుడులో సంప్రదాయ ఇంధనంతో తయారు చేసిన మినపరొట్టెను అరటి ఆకులో వేసుకుని తింటూ ఉంటూ ఆరుచికి లొట్టలేసుకుని మరీ తింటున్నారు టిఫిన్‌ ప్రియులు. వివరాల్లోకి వెళితే అంబాజీపేట మండలం ముక్కామలలో ఒక చిన్న పూరి పాకలో కాల్వగట్టుపై చిన్న హోటల్‌ ఉంది. అబ్బిరెడ్డి సత్యనారాయణ గత 50 ఏళ్ల నుండి ఈ పూరి పాకలో మినపరొట్టెను సాయంత్రం సమయంలో విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. మట్టి మూకుడులో నిప్పులపై కాల్చిన మినపరొట్టె ఎంత రుచో మాటల్లో చెప్పలేమని రొట్టె ప్రియులు చెబుతున్నారు. పావలా నుండి రూ.15 వరకు గత 50 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఈ హొటల్‌ మినపరొట్టెకు ఫేమస్‌. 25 పైజల నుండి నేటు రూ.15 రూపాలయు విక్రయిస్తూనే ఉన్నానని సత్యనారాయణ తెలిపాడు. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు హొటల్‌ నిర్వహిస్తానని చెబుతున్నాడు. ప్రతీ రోజు సుమారు 100 నుండి 150 మినప రొట్టెలను విక్రయిస్తానంటున్నాడు.

సాంప్రదాయ ఇంధనంతో తయారీ..
మట్టి మూకుడులో మినపరొట్టె తయారీకి సత్యనారాయణ ఇంధనాన్ని మాత్రమే వినియోగిస్తాడు. ఇటుకలపొయ్యిపై కొబ్బరి డొక్కలను ఉపయోగిస్తాడు. మట్టి మూకుడులో మినపపిండి వేసి దానిపై మూత ఉంచి కింద పైన డొక్క నిప్పుల సెగతో రొట్టెను తయారు చేస్తాడు. 

అరటి ఆకులోనే సరఫరా
టిఫన్‌ ప్లేట్‌లలో ప్లాస్టిక్‌ పేపర్, గ్లాసులు కూడా వాడకుండా అరటి ఆకులో టిఫిన్‌ వేసి సరఫరా చేస్తున్నాడు. 50 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు మట్టి మూకుడు, నిప్పుల పొయ్యి తప్ప దేనిపైనా వండలేదని చెబుతున్నాడు. 

రంపచోడవరం:  గిరిజనుల ఆహారంలో ప్రత్యేకమైనది వెదురు కూర. ఇది చాలా రుచికరంగా ఉంటుంది.   వెదురు కోకిం కుసీర్ అని పిలిచే వెదురు కూరను ఇంగ్లిషులో బాంబూ షూట్ అని అంటారు. అడవిలో వెదురు  బొంగులు ఏర్పడడానికి ముందు లేత మొక్కలు (వెదురు కొమ్ములు) వస్తాయి. ఆ దశలో అవి భూమిలో నుంచి పైకి రాగానే వాటిని కట్‌చేసి పై పొరను తీసేసి శుభ్రం చేసి గోరువెచ్చని నీటిలో ఉడకబెడతారు. అనంతరం వాటిని  సన్నగా తురిమి కారం, మసాలా దినుసులు కలిపి కూరగా వండుతారు. కొంతమంది వాటిని ఎండబెట్టి కొన్నిరోజుల తరువాత కూడా కూరగా వండుకుంటారు.  ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని గిరిజనులు వెదురు కొమ్ములను సేకరించి కొమ్ములుగా లేక సన్నగా తరిగి సంతల్లో విక్రయిస్తున్నారు.  వెదురు కొమ్ములతో పచ్చళ్లు కూడా తయారు చేసి పట్టణాల్లోని గిరిజన స్టాల్స్‌లో విక్రయిస్తున్నారు.  

  

మరిన్ని వార్తలు