ఖర్చు తక్కువ, ఇంధనం ఆదా అయ్యే సరికొత్త కుకింగ్‌ స్టవ్‌లు, ఫ్యాన్‌లు!

3 Nov, 2023 13:19 IST|Sakshi

కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ ప్రభుత్వ రంగ సంస్థల జాయింట్‌ వెంచర్‌ ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీస్‌ లిమిటెడ్‌(ఈఈఎస్‌ఎల్‌) ఆధ్వర్యంలో నేషనల్‌ ఎఫిషియెంట్‌ కుకింగ్‌ ప్రోగ్రామ్‌(ఎన్‌ఈసీపీ), ఎనర్జీ ఎఫిషియెంట్‌ ఫ్యాన్స్‌ ప్రోగ్రామ్‌(ఈఈఎఫ్‌పీ)ని ప్రారంభించారు. అందులో భాగంగా ఈఈఎస్‌ఎల్‌ దేశవ్యాప్తంగా ఒక కోటి సమర్ధవంతమైన బీఎల్‌డీసీ ఫ్యాన్‌లు, 20 లక్షల సమర్థవంతమైన ఇండక్షన్‌ కుకిగ్‌ స్టవ్‌లను పంపిణీ చేస్తోంది. వంట పద్ధతులను విప్లవాత్మకంగా మార్చడం, శక్తి సామర్థ్యం వినియోగంపై ప్రాముఖ్యత, ఆవశ్యకతలను తెలియజేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది ఈఈఎస్‌ఎల్‌. ఇంతకీ ఈ ఇండక్షన్‌ స్టవ్‌లు, బీఎల్‌డీసీ ఫ్యాన్‌ల ఉపయోగం, ప్రయోజనాలు ఏమిటి? ఇవి సాధారణ ప్రజలకు ఉపయోగపడతాయా?

ఈ కుకింగ్‌ స్టవ్‌ ప్రత్యేకత..
నేషనల్‌ ఎఫిషియెంట్‌ కుకింగ్‌ ప్రోగ్రామ్‌(ఎన్‌ఈసీపీ) తీసుకువచ్చిన ఈ ఇండక్షన్‌ ఆధారిత కుకింగ్‌ స్టవ్‌ సాంప్రదాయ వంట పద్ధతులకు మించి సుమారు 25 నుంచి 30 శాతం ఖర్చు ప్రయోజనాలను అందిస్తాయి. వీటితో ఇంధనం ఆదా అవ్వడమే గాక తక్కువ ఖర్చుతో మంచి వంటను అందించగలుగుతాం. భారతదేశం అంతట ఈ ఇండక్షన్‌ స్టవ్‌లు వినియోగించడం వల్ల ముఖ్యంగా పర్యావరణం హితకరంగా ఉంటుంది. అంతేగాదు వాతావరణంలో గాలి స్వచ్ఛంగా ఉండటమే గాక పౌరులకు మెరుగైన ఆరోగ్యం అందుతుంది.

ఈ స్టవ్‌లను ఈఈఎస్‌ఎల్, మోడరన్‌ ఎనర్జీ కుకింగ్‌ సర్వీసెస్‌(ఎంఈసీఎస్‌)ల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున దేశంలో పంపిణీ చేస్తోంది. దీంతో వంటశాలల్లో ఈ ఆధునిక ఎలక్ట్రిక్‌ వంట పరికరాల హవా వేగవంతంగా విస్తరించడమే గాకుండా వంట పద్ధతుల్లో వేగవంతంమైన మార్పులు వస్తాయని చెబుతున్నారు కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌. తక్కువ ఆదాయ కుటుంబాలకు ఈ స్టవ్‌ చాలా బాగా ఉపయోగపడుతుందని అన్నారు.

సీలింగ్‌ ఫ్యాన్‌ ప్రత్యేకత
ఎనర్జీ ఎఫిషియెంట్‌ ఫ్యాన్స్‌ ప్రోగ్రామ్‌(ఈఈఎఫ్‌పీ) ఎల్‌సీడీ బల్బులు మాదిరిగా విద్యుత్‌ ఖర్చు తక్కువ, పర్యావరణానికి మేలు కలిగించేలా ఈ సీలింగ్‌ ఫ్యాన్‌లను అభివృద్ధి చేశారు. ఈ ఫ్యాన్‌ వల్ల విద్యుత్‌ బిల్లు కూడా తక్కువగానే ఉంటుంది. విద్యుత్ వినియోగంలో 35% తగ్గించే లక్ష్యంతో ఈ ఆధునాత ఫ్యాన్‌లను తీసుకొచ్చింది ఈఈఎస్‌ఎల్‌. ఇంతకమునుపు ఎల్‌ఈడీ బల్బులను తీసుకొచ్చి ప్రతి ఇంట్లో అవి ఉండేలా విజయవంతమైంది. మళ్లీ అదేవిధమైన విజయం పునరావృత్తమయ్యేలా ఈ ఆధునాత ఎలక్ట్రిక్‌ సీలింగ్‌ ఫ్యాన్‌లు, ఇండక్షన్‌ స్టవ్‌లను తీసుకొచ్చింది. 

ప్రయోజనం

  • ఈ రెండు ఆధునాత ఎలక్రిక్‌ పరికరాల వల్ల కార్బన్‌ ఉద్గారాలు గణనీయంగా త్గగుతాయి
  • అలాగే 12 జీడబ్ల్యూ గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ని నిరోధించగలం
  • వినియోగదారులకు విద్యుత్‌ బిల్లు కూడా తక్కువగానే వస్తుంది.

ఈ నేషనల్ ఎఫిషియెంట్ కుకింగ్ ప్రోగ్రామ్, ఎనర్జీ ఎఫిషియెంట్ ఫ్యాన్ ప్రోగ్రామ్‌లు భారతీయ గృహాలలో ఇంధన సామర్థ్యాన్ని పెంచడం తోపాటు కార్బన్ ఉద్గారాల పాదముద్రలను తగ్గించేలా సాహసోపేతమైన చర్యలు తీసుకుంటోంది. అంతకమునుపు ఉజ్వలా కింద జాతీయ వీధిలైట్ల కార్యక్రమంలో మిలియన్ల కొద్దీ ఎల్‌ఈడీ బల్బుల పంపిణీని తీసుకొచ్చి క్షేత్ర స్థాయిలో శక్తి వినియోగాన్ని, గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ని తగ్గించి గణనీయమైన ఫలితాన్ని పొందేలా చేసింది ఈఈఎస్‌ఎల్‌ . అదేవిధంగా ఈ ఇండక్షన్‌ కుకింగ్‌ స్టవ్‌లు, సీలింగ్‌ ఫ్యాన్‌లు శక్తి వినియోగాన్ని, కార్గన్‌ ఉద్గారాలను తగ్గించి పూర్తి స్థాయిలో విజయవంతమవుతాయని విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ ఆ కాంక్షిస్తున్నారు. 

(చదవండి: చేతులు లేని తొలి మహిళా పారా ఆర్చర్‌! రెండు పతకాలతో ప్రపంచాన్నే..)

మరిన్ని వార్తలు