ఈ మల్టీ స్పెషాలిటీ కుక్కర్ గురించి విన్నరా..

29 Oct, 2023 08:35 IST|Sakshi

మల్టీ – ఫంక్షనల్‌ మేకర్స్‌ ఇప్పుడు సర్వసాధారణం. వినియోగించడమూ తేలికే! అలాంటి ఈ పరికరం కుకర్‌లానే కాదు.. స్టీమర్‌గానూ పని చేస్తుంది. పైగా ఎక్కువ మోతాదులో వండిపెట్టగలదు. ఇందులో రకరకాల రైస్‌ ఐటమ్స్‌తో పాటు.. సూప్స్, చికెన్‌  కర్రీస్, మటన్‌ కుర్మా ఇలా చాలానే చేసుకోవచ్చు. గుడ్లు, కూరగాయలు, కండెలు, దుంపలు వంటివీ ఉడికించుకోవచ్చు. ఇది సుమారుగా మూడులీటర్ల సామర్థ్యంతో దాదాపు 5 కేజీలపైనే బియ్యాన్ని ఉడికించగలదు. ఈ కుకర్‌ ఆపరేటింగ్‌ ప్యానెల్‌లో లేటెస్ట్‌ మైక్రో స్విచ్‌ అమర్చి ఉండటంతో కుకింగ్‌ చాలా ఈజీ. వంట పూర్తయిన తర్వాత 6 గంటల పాటు వేడిగా ఉంచే.. ఆటోమేటిక్‌ వార్నింగ్‌ ఆప్షన్‌ ఉంటుంది. 

(చదవండి: రైస్‌ దగ్గర నుంచి సూప్స్‌, న్యూడిల్స్‌ వరకు అన్నీ ఈ కుకర్‌లోనే..!)

మరిన్ని వార్తలు