‘దేశం’లో కల్లోలం

15 May, 2016 00:39 IST|Sakshi
‘దేశం’లో కల్లోలం

 భామిని: పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్న భామిని మండల టీడీపీ కార్యకర్తలపై నిర్లక్ష్యం తగదని పలువురు టీడీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశా రు. మంత్రి నిర్లక్ష్యం వల్ల మండలంలో పార్టీ నీరుగారిపోతోందని అన్నారు. ప్రతి చిన్న విషయానికి వర్గాలుగా మాట్లాడుతున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీషకు ఫిర్యాదు చేశారు. శనివారం భామిని మండల పరిషత్ కార్యాలయంలో జిల్లా దేశం పార్టీ అధ్యక్షురాలు గౌతు శిరీష ఆధ్వర్యంలో నిర్వహించిన కరువు నివారణ, శాశ్వత పరిష్కారాల కోసం నిర్వహిం చిన సమావేశంలో పార్టీ నాయకుడు జగదీశ్వరరావుతో పాటు కార్యకర్తలు పార్టీ నేతల తీరుపై మండిపడ్డారు.
 
 నిధులు దారి మళ్లించి మండలాన్ని అ భివృద్ధికి దూరం చేస్తున్నారని అన్నా రు. కార్యక్రమంలో రాష్ర్ట ప్రభు త్వ పరిశీలకునిగా పాల్గొన్న గోవిందరెడ్డి సమక్షంలో వారు ఆరోపణలు గు ప్పించారు. దీంతో ఆయన పార్టీ విషయాలు వేరే సమావేశాల్లో మాట్లాడుకుందామని చెప్పి శాంతింపజేశారు. అయితే చిన్ననీటి పథకాలు, మినీ రి జర్వాయర్ల సూచనలు ఇచ్చినా పట్టిం చుకోలేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలం రాక మునుపే నీరు -చెట్టు పనులు చేయాలని కోరారు. భామినిలో శాశ్వత కరువు నివారణకు మినీ రిజర్వాయర్లు నిర్మించాలన్నారు. ఉపాధి పనుల నిలిపివేతపై బాహాటంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు.   
 

మరిన్ని వార్తలు