అందాల పోటీలను ఆపాలని ఆందోళన

29 Oct, 2017 13:51 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం/ద్వారకానగర్‌:  అందాల పోటీలకు వ్యతిరేకంగా మహిళలు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సాక్షాత్తు మహిళా పోలీసులే సాటి మహిళలపై అనుచితంగా ప్రవర్తించి వివస్త్రలుగా చేయాలని ప్రయత్నించడం తీవ్ర విమర్శలకు దారితీసింది.  సేవ్‌ గర్ల్‌ పేరిట ‘మిస్‌ వైజాగ్‌–2017’ అందాల పోటీలను నవంబరు 11న విశాఖ నగరంలో నిర్వహిస్తున్నట్టు క్రియేటివ్‌ ప్లస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్, రేస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్, డ్రీమ్స్‌ ఈవెంట్స్‌ సంస్థలు ఇటీవల ప్రకటించాయి.

ఇందులో భాగంగా ఆదివారం ఉదయం ఆశీల్‌మెట్టలోని ఓ హోటల్‌లో ఆడిషన్స్‌ నిర్వహణకు సన్నద్ధమయ్యాయి. దీన్ని వ్యతిరేకిస్తున్న మహిళా సంఘాలు  ఆందోళన చేపట్టాయి. పోలీసులు మహిళలను అక్కడ నుంచి బలవంతంగా తరలించేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.  లాఠీచార్జి చేయడంతో పాటు పోలీసులు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు.   

మరిన్ని వార్తలు