పాపం అంజలికి స్థూలకాయం

25 Jun, 2019 08:19 IST|Sakshi

స్థూలకాయంతో బాధపడుతున్న కోతి 

20 ఏళ్లుగా పెంచుకుంటున్న శివారెడ్డి 

సాక్షి, కడప : అంజలి పేరు విని అమ్మాయి అనుకునేరు. అంజలి అంటే కోతిపేరు. ఆ కథ ఏంటో తెలుసుకుందాం... పెద్దశెట్టిపల్లె గ్రామానికి చెందిన శివారెడ్డి, సుబ్బలక్షుమ్మలకు సంతానం లేదు. చిన్న తనంలో తన ఇంటి పరిసరాల్లో వచ్చిన కోతిని మచ్చిక చేసుకున్నారు. కోతికి అంజలి అని ముద్దుగా పేరు పెట్టారు. దీంతో వారికి కోతితో అనుంబంధం ఏర్పడింది. కోతికి ప్రత్యేకంగా డ్రెస్‌ కుట్టించడంతోపాటు ఇంటిలోనే ఆహార పానీయాలు పెడుతూ పోషిస్తున్నారు. 20 ఏళ్ల నుంచి అలాగే పోషిస్తుండగా ప్రస్తుతం కోతికి స్థూలకాయం ఏర్పడింది. 14 కిలోల బరువు ఉంది.

దీంతో నడవడానికి అంజలి ఇబ్బంది పడుతోంది. వైద్య చికిత్స నిమిత్తం సోమవారం గోపవరం గ్రామ పరిధిలోని ప్రభుత్వ పశువైద్య కళాశాల ప్రాంగణంలో ఉన్న వైద్యశాలకు తీసుకెళ్లారు. పరీక్షలు చేసిన అనంతరం పశువైద్య నిపుణుడు అన్నం పెట్టకుండా కేవలం జొన్న, రాగులతో తయారు చేసిన వంటకాలను మాత్రమే పెట్టాలని సూచించారు. పశువైద్య కళాశాల విద్యార్థులు ఆశ్చర్యంతో శివారెడ్డిని కోతి గురించి అడిగి తెలుసుకున్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు