'ఆక్వా రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం'

7 Apr, 2020 15:57 IST|Sakshi

సాక్షి, అమరావతి : కరోనా ప్రభావం ఆక్వారంగంపై పడకుండా చూస్తున్నామని, అనవసరంగా దళారుల మాటలు నమ్మి ఆక్వా రైతులెవరు మోసపోవద్దని మంత్రి మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఆక్వా ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేలా ఎగుమతిదారులతో మాట్లాడినట్లు తెలిపారు. కాగా ఆక్వా ఉత్పత్తులకు ధరలు కూడా నిర్ణయించినట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో ఆక్వాజోన్లలో కోల్డ్‌ స్టోరేజ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కరోనా నివారణ చర్యలపై నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు మోపిదేవి తెలిపారు. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రతిపక్షం రాజకీయ విమర్శలు చేయడం దారుణమని తెలిపారు.  గ్రామస్థాయిలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నామని  వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీపుకుంటున్నామన్నారు. హార్వెస్టింగ్‌ యంత్రాలకు,  కూలీలకు ఇబ్బందులు కలిగించొద్దని ఆదేశాలిచ్చామన్నారు. పొలం పనులకు వెళ్లేవారు గుంపులుగా వెళ్లొద్దని కన్నబాబు తెలిపారు.

>
మరిన్ని వార్తలు