Corona: దేశంలో కొత్తగా 88 కరోనా కేసులు.. 400 మందికి చికిత్స!

2 Dec, 2023 13:39 IST|Sakshi

గతంలో కరోనా వైరస్‌ విజృంభణతో దేశం  అతలాకుతలమైపోయింది. లక్షల మంది మృత్యువాత పడ్డారు. వ్యాక్సినేషన్ తర్వాత కొంత ఉపశమనం లభించింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే ఈ మహమ్మారి  ఇంకా మన మధ్య నుంచి పోలేదు. భారత్‌లో కొత్తగా 88 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే 396 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 

ఇప్పటివరకూ కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,33,300. కరోనా సోకిన వారి సంఖ్య 4,50,02,103. మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 4,44,68,407కు పెరిగింది. దేశంలో కరోనా నుండి కోలుకున్నవారి శాతం 98.81 కాగా, మరణాల రేటు 1.19 శాతం. దేశంలో ఇప్పటివరకు మొత్తం 220.67 కోట్లకు పైగా కోవిడ్ -19 వ్యాక్సిన్‌లు అందించారు. కాగా సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (ఐజీఎంసీ)లో కరోనా పాజిటివ్‌తో ఒక మహిళ మృతి చెందింది. 
ఇది కూడా చదవండి: భోపాల్‌ విషాదానికి 39 ఏళ్లు.. ఆ రోజు ఏం జరిగింది?

మరిన్ని వార్తలు