బాబు ప్రవచనాలు తన కంపెనీకి వర్తించవా?

5 May, 2020 12:40 IST|Sakshi

సాక్షి, అమరావతి : గతంలో పది ఇళ్లకు ఒక బెల్టు షాపు కొనసాగితే ఎక్కడా క్యూలు ఉండేవి కావని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి వచ్చాక బెల్టు షాపులే లేకుండా చేశారని, వైన్ షాపుల సంఖ్య తగ్గించడం వల్ల జనాల్లో కొంత ఆతృత కనిపిస్తోందని పేర్కొన్నారు. ఎన్టీర్ తెచ్చిన మద్య నిషేదాన్ని ఎత్తేసిన వ్యక్తి గుండెలు బాదుకుంటుంటే నవ్వొస్తోందని ఎద్దేవాచేశారు.

“ఉప్పల్ హెరిటేజ్‌లో నలుగురికి కరోనా, వారి వల్ల 25 మంది క్వారంటైన్‌” వీరంతా సత్వరం కోలుకోవాలని విజయసాయిరెడ్డి ఆకాంక్షించారు. ఈ వార్త పబ్లిష్‌ కాకుండా, టెలికాస్ట్‌ కాకుండా మీడియాను మేనేజ్‌ చేసిన చంద్రబాబును ఏం చేయాలి? బాబు ప్రవచనాలు తన కంపెనీకి వర్తించవా? అని విజయసాయిరెడ్డి ట్విట్‌ చేశారు.

మరిన్ని వార్తలు