ఈసీ సోషల్‌ మీడియా వింగ్‌లో టీడీపీ కోవర్టులు

3 May, 2019 17:18 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఎన్నికల సంఘంలోని సోషల్‌ మీడియా వింగ్‌లో టీడీపీ కోవర్టులు ఉన్నారని వైఎస్సార్‌సీపీ నేత ఎంవీఎస్‌ నాగిరెడ్డి సీఈఓ గోపాలకిృష్ణ ద్వివేదికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా, టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఈసీలో కొంత మంది పనిచేస్తున్నారని అన్నారు . ఈమేరకు శుక్రవారం ఆయన ద్వివేదిని కలిసి వినతిపత్రం అందించారు. ఈసీ సోషల్‌ మీడియా వింగ్‌ పేరుతో టీడీపీకి అనుకూలంగా పనిచేసే వారిని చంద్రబాబు నాయుడు పథకం ప్రకారం నియమించుకున్నారని నాగిరెడ్డి ఆరోపించారు.

పోస్టల్‌ బ్యాలెట్ల కోసం ప్రలోభాలకు పాల్పడుతున్న టీడీపీ అభ్యర్థి సబ్బంహరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రలోభాలతో సబ్బంహరి పోస్టల్‌ బ్యాలెట్స్‌ను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారని, ప్రలోభాల ఆడియో టేపులను ఈసీకి అందచేశామని నాగిరెడ్డి తెలిపారు. టీడీపీకి తొత్తులుగా వ్యవహిస్తూ.. ఆబ్జెక్ట్‌ ఏజెన్సీ ఓటర్లని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందని, ఇంటలిజెన్స్‌ అండతోనే అది ఈసీలోకి ప్రవేశించిందని ఆరోపించారు. కౌంటింగ్‌ రోజు కేంద్రాల వద్ద భద్రత పెంచాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాసిన లేఖను సీఈఓకు అందచేశామని అన్నారు. 

మరిన్ని వార్తలు