నాగుల పంచమి జరుపుకున్న మహిళలు

11 Aug, 2013 20:15 IST|Sakshi
నాగుల పంచమి జరుపుకున్న మహిళలు

హైదరాబాద్: నాగుల పంచమిని రాష్ట్ర ప్రజలు ఈ రోజు భక్తిశ్రద్దలతో ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ ప్రాంతంలో ప్రసిద్ది చెందిన పండగల్లో నాగుల పంచమి ఒకటి.  నాగులపంచమి పండగను మహిళల పండగగా పిలుస్తారు. పంచమికి ఒక రోజు ముందు మహిళలు ఉపవాసం ఉంటారు. ఉదయాన్నే తలంటూ స్నానం చేసి కొత్త దుస్తువులు ధరించి పాలు, నైవేద్యం, పూజా సామాగ్రి తీసుకొని పుట్టల వద్దకు వెళ్లారు. అనావాయితీగా వస్తున్న ఆచారం ప్రకారం నాగదేవతకు పూజలు నిర్వహించారు.

 పండగను పురస్కరించుకొని మహిళలు, పిల్లలు నాగదేవత ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుట్టలకు పూజలు చేసి పాలు, నైవేద్య సమర్పించారు. మహిళలు, పిల్లలు కొత్త దుస్తువులు దరించి పండగను ఘనంగా జరుపుకున్నారు. కొన్ని ప్రాంతాలలో ఉదయం నుంచే దేవాలయాలు, పుట్టల వద్ద మహిళల సందడి కనిపించింది. పండగను పురస్కరించుకొని కొందరు ప్రత్యేక పండి వంటలతో నైవేద్యం తయారుచేసి నాగదేవతాలకు సమర్పించారు.  
 

మరిన్ని వార్తలు