‘అరవింద సమేత’కు టీడీపీ చిచ్చు

11 Oct, 2018 08:07 IST|Sakshi

నందమూరి అభిమానులు వర్సెస్‌ తెలుగు తమ్ముళ్లు

అభిమానులు వైఎస్సార్‌సీపీకి చెందినవారని.. టికెట్లు ఇవ్వొద్దని టీడీపీ నేతల హుకుం

ఆగ్రహంతో థియేటర్‌ ముందు ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించిన అభిమానులు

విశాఖ జిల్లా పాయకరావుపేటలో ఉద్రిక్తత

సాక్షి, నక్కపల్లి/పాయకరావుపేట: ప్రముఖ సినీనటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన ‘అరవింద సమేత’ సినిమా టికెట్ల వ్యవహారం నందమూరి అభిమానులు, తెలుగు తమ్ముళ్ల మధ్య చిచ్చు రగిల్చింది. ఈ సినిమా నేడు (గురువారం) విడుదల కానుంది. పాయకరావుపేటలో సాయిమహల్‌ థియేటర్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. పట్టణంలో బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌ సినిమాలు విడుదలైతే నందమూరి కల్చరల్‌ యూత్‌ అసోసియేషన్, బాలకృష్ణ ఫ్యాన్స్‌ గౌరవాధ్యక్షుడు చింతకాయల రాంబాబు, అధ్యక్షుడు విశ్వనాధుల శ్రీను హడావుడి చేస్తుంటారు.

వీరిద్దరూ టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నవారే. అయితే రాంబాబు కొద్దిరోజుల నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. విశ్వనాధుల శ్రీను ఇటీవలే వైఎస్సార్‌ సీపీలో చేరారు. అయినా నందమూరి హీరోలపై అభిమానాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ‘అరవింద సమేత’ మొదటి షో అభిమానులే చూడాలన్న ఆశతో రాంబాబు, శ్రీను అభిమానులను వెంటబెట్టుకుని టికెట్ల కోసం వెళ్లారు. అయితే థియేటర్‌ మేనేజర్‌.. మీరు వైఎస్సార్‌సీపీకి చెందినవారు కావడంతో టికెట్లు ఇవ్వొద్దని టీడీపీ ఎమ్మెల్యే అనిత చెప్పారని కాబట్టి టికెట్లు ఇచ్చేదిలేదని చెప్పడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


థియేటర్‌ వద్ద ఫ్లెక్సీలు తొలగించి కిందపడేసిన అభిమానులు

పార్టీలు వేరైనా తాము నందమూరి అభిమానులమేనని, తమకు టికెట్లు ఎందుకు ఇవ్వరంటూ నిలదీశారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి తమ అభిమాన నటుడి సినిమాకు ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టామని, తమకే టికెట్లు ఇవ్వరా అని ప్రశ్నించారు. సినిమా టికెట్లలో కూడా తెలుగుదేశం పార్టీ నేతలు రాజకీయం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఎమ్మెల్యే అనిత హయాంలోనే ఇలా జరుగుతోందని చెప్పారు. అధికార పార్టీ కార్యకర్తలు, నాయకులకే టికెట్లు అమ్ముకోండి.. వారే సినిమా చూస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. (అందుకే మాట్లాడటం మానేశాం : ఎన్టీఆర్‌)

తమకు టికెట్లు ఇవ్వనప్పుడు తాము కట్టిన ఫ్లెక్సీలు, బ్యానర్లు ఎందుకంటూ వాటిని తొలగించారు. థియేటర్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు థియేటర్‌ యాజమాన్యంతో మాట్లాడారు. ఉదయం ఎమ్మెల్యే అనిత టికెట్లు ఇవ్వొద్దన్నారని చెప్పిన మేనేజర్‌ సీతారామ్‌ సాయంత్రానికి మాటమార్చి తాను ఎమ్మెల్యే పేరు ప్రస్తావించలేదని మండల టీడీపీ అధ్యక్షుడు పెదిరెడ్డి చిట్టిబాబు ఇవ్వొద్దన్నారని మాత్రమే చెప్పానన్నారు. బాలకృష్ణ ఫ్యాన్స్‌ సభ్యులంతా వైఎస్సార్‌సీపీకి చెందినవారని వారికి టికెట్లు ఇవ్వద్దని చెప్పినట్లు వెల్లడించారు. (ప్రొఫెషనల్‌ బ్రదర్స్‌)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

24న సీఎం జగన్‌ అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు

బాబు చరిత్ర ఈ ఎన్నికలతో ముగిసింది: గంగుల

ఈనాటి ముఖ్యాంశాలు

మనసు మార్చుకున్న ఎంపీ సీతా రామలక్ష్మి

బీజేపీలో చేరిన నలుగురు టీడీపీ ఎంపీలు 

బెజవాడలో మళ్లీ నకిలీ కరెన్సీ కలకలం

2021 కల్లా పోలవరం పూర్తి : అనిల్‌

వారం క్రితమే చంద్రబాబును కలిశా...

జనసేన పార్టీకి మరో షాక్‌

భారీ షాక్‌; రాజ్యసభలో టీడీపీ ఖాళీ!

కులాల వారీగా ఓటర్ల గణన పూర్తి 

పోలవరం పనులపై నిపుణులతో ఆడిటింగ్‌..

టీడీపీ కాపు నేతల రహస్య భేటీ

జగన్‌ నిర్ణయం అభినందనీయం: ఎస్పీ

బాబు సూచన మేరకే బీజేపీలో చేరుతున్నారు

వైఎస్‌ జగన్‌ చరిత్రలో నిలిచిపోతారు: పుష్పశ్రీవాణి

పోల‘వరం’... రాజన్నదే!

నాణ్యమైన విద్యను అందించి.. ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

పట్టాలు ఇచ్చారు... లే అవుట్‌లు మరిచారు

ఆ వివరాలు ప్రజల ముందు ఉంచుతాం

హెల్త్ వర్కర్ల వేతనాలు 400 నుంచి 4 వేలకు పెంపు

పోలవరంలో వైఎస్‌ జగన్‌

విద్యా‘వ్యాపారం’..!

సీఎం జగన్‌ పోలవరం పర్యటన ఎందుకు?

పోలవరానికి శాపంగా బాబు పాలన

తండ్రిని హతమార్చిన తనయుడు!

అతిథి ఉన్నా.. ఆదాయం కరువు

చెట్టు రూపంలో మృత్యువు

అమ్మో.. మధ్యాహ్న భోజనం..

రాజధాని అని అంతా అన్యాయం చేశారయ్యా..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కబీర్‌ సింగ్‌ సూపర్‌.. షాహిద్‌ కెరీర్‌ బెస్ట్‌ పర్ఫార్మెన్స్‌!

మా తమ్ముడు కూడా వేధిస్తున్నాడు : హీరో సోదరి

'సూపర్‌ 30' ఆనంద్‌కుమార్‌ ఇంటర్వ్యూ

ప్రేక్షకుల్ని మాయ చేస్తున్న ఫకీర్‌

‘అవెంజర్స్‌ : ఎండ్‌ గేమ్‌’ మళ్లీ వస్తోంది!

తాగుబోతుల వీరంగం.. దర్శకుడికి గాయాలు